Thursday, April 25, 2024

హత్య కేసులో ఎపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు.. పక్కా ప్లాన్‌తో చంపారు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కర రావు హత్యకేసులో అరెస్టైన ఎపి మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరికాసేపట్లో నాయమూర్తి ముందు కొల్లు రవీంద్రను హాజరపర్చనున్నారు. రవీంద్ర అరెస్టుపై జిల్లా ఎస్‌పి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ.. ‘మోకా హత్య కేసులో విచారణ చేస్తున్నాం. ప్రత్యక్షసాక్ష్యులు, సాంకేతిక అంశాల ఆధారంగా సాక్ష్యాలు సేకరించాం. ఈ హత్య కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశాం. కొల్లు రవీంద్రపై ఫిర్యాదు వచ్చింది. మోకా హత్య కేసులో ప్రధాన నిందితుడు నాంచారయ్య కొల్లు రవీంద్ర అనుచరుడు. ప్రదాన నిందితుడు నాంచారయ్య, మోకాకు మధ్య గత ఏడేళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. 6నెలల కాలంలో ఇద్దరికి చిన్నచిన్న గొడవలు తలెత్తాయి. మోకా ఫేమ్‌ను తట్టుకోలేక హత్య చేశారు.

ఆధిపత్య పోరులోనే మోకా హత్య జరిగింది. 2013నుంచే మోకా హత్యకు ప్రయత్నాలు జరిగాయి.  మోకా హత్య ప్లాన్ ను నాంచాయ్య కొల్లు రవీంద్రతో చర్చించారు. ప్లాన్ మిస్ అవ్వకూడదని ఆయన నిందితులకు సూచించాడు. తన పేరు ఎక్కడా బయటకు రావొద్దని ముద్దాయికి రవీంద్ర చెప్పారు. అండగా ఉంటానని నాంచారయ్యకు రవీంద్ర హామీ ఇచ్చారు. మోకాను రక్కీ చేసి మరీ చంపారు. ఈ నెల 28నే మోకా హత్యకు ప్లాన్ చేశారు. అయితే, అది విఫలమైంది. 29న ప్లాన్ ప్రకారం మార్కెట్‌కు వచ్చిన మోకాను హత్య చేశారు. మోకాను మగ్గురు వ్యక్తులు విచక్షణారాహితంగా చంపారు. నిందితులకు సహకరించిన కొల్లు రవీంద్రను ఈ రోజు అరెస్టు చేశాం. హత్య తర్వాత నాంచారయ్య వేరే ఫోన్‌తో రవీంద్ర పిఎకు కాల్ చేశారు. పిఎ ఫోన్‌తోనే రవీంద్ర నాంచారయ్యతో మాట్లాడాడు. పని అయిపోయిందా అని కూడా నిందితుడిని అడిగారు. మోకా హత్య ప్లానింగ్‌లో కొల్లు రవీంద్ర భాగస్వామి. నిందితుల కాల్ డేటాను పరిశీలించాం. కొల్లు రవీంద్రను జడ్జ్ ముందు ప్రవేశపెడుతాం’ అని వివరించారు.

AP Former Minister Ravinder Arrest in Moka murder case

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News