Home రాష్ట్ర వార్తలు ఎపి ప్రభుత్వాన్ని,  గర్జన నిర్వాహకులను తప్పుపట్టిన పవన్

ఎపి ప్రభుత్వాన్ని,  గర్జన నిర్వాహకులను తప్పుపట్టిన పవన్

pawankalayan హైదరాబాద్:కాపుల అంశంపై సరైన ప్రతినిధులతో ముందే చర్చించి, వారికి నమ్మకం కలిగించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అని జనసేన పార్టీ అధ్యక్షులు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. లక్షలాది మంది తరలివచ్చిన కాపు గర్జన సందర్భంగా ప్రభుత్వం సరైన ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాపు గర్జన సందర్భంగా రైలును తగులబెట్టిన ఘటన పద్ధతి ప్రకారం చేసిందని, దీని వెనుక అసాంఘిక శక్తు లు ఉన్నాయని అన్నారు. తునిలో జరిగిన ఘటన నేప థ్యంలో కేరళలో షూటింగ్ రద్దు చేసుకుని హుటాహు టిన హైదరాబాద్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్, తన నివా సంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. లక్షలాది మంది ఒక చోట చేరిన ప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగవని టిడిపి ప్రభుత్వం ఎందుకు భావించిందని ప్రశ్నించారు. ఇటీ వల ఎన్నో ఉద్యమాలు చూశామని, గుజరాత్‌లో పటేళ్ళ ఉద్యమం, ఉత్తరభారతంలో కులఉద్యమాల్లో ట్రైన్‌లు ఆపేసిన, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఘట నలు ఉన్నాయని గుర్తు చేశారు. ఒక్క చిన్న ఆడియో ఫంక్షన్‌కే అనుమతి కోసం లక్షా తొంభై ఆలోచిస్తారని, అలాంటిది లక్షల మంది ప్రజలు ఒక ప్రాంతానికి చేరితే దాని గురించి మందుజాగ్రత్తలు ఎందుకు తీసుకోలే దన్నారు. సరిపడా పోలీసు ఫోర్స్ ఉంటే హింసాత్మక ఘటన జరిగేవా? అని ప్రశ్నించారు. రైలును తగల బెట్టడం చాలా బాధ కలిగించిందని, ఏ ఉద్యమమైనా సరే శాంతియుతంగా నిర్వహిస్తేనే విజయవంతమవు తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉద్యమకారులు కూడా ప్రజలను రెచ్చగొట్టొదని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రైలు తగులబెట్టిన పని సభకు వచ్చిన సాధారణ కార్యకర్తలు చేయలేదని, కచ్చితంగా ప్రొఫెషనల్స్ చేసి ఉంటారన్నారు. ఒక్క అగ్గిపుల్లతో ట్రైయిన్ తగులబెట్టడం సాధ్యం కాదని, ఇది పద్ధతి ప్రకారం చేసిందేనని, దీని వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆరోపించారు. కాపుల రిజర్వేషన్ అంశం ఒక్క రోజుతో వచ్చింది కాదని, బ్రిటీష్ కాలం నుంచి వారికి రిజర్వేషన్‌లు ఉన్నాయని, 1956వరకు కొన సాగాయని, మధ్యలో కొంత కాలం బ్రేక్ పడినా, తరు వాత కొనసాగి మళ్ళీ ఆగిపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే కాపులోని అనేక తెగల్లో ఉత్తరాంధ్ర, తెలంగాణలో బిసిలుగా గుర్తింపు ఉన్నదని, రాయల సీమ, కోస్తాంధ్రలోనే బిసిలుగా గుర్తింపులేదన్నారు. ప్రతి సారి పార్టీలు కాపులను బిసిల్లో చేరుస్తామని ఓటు బ్యాంకుగా మార్చుకుని వదిలేయడంతో వారికి బాధ కలుగుతోందన్నారు. ఎన్ని కమిషన్‌లు వేసినా ఫలితం ఉండదనే ఉద్దేశంతో సభను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. అయితే ప్రభుత్వం ముందే సరైన దృష్టితో వ్యవహరించి, సరైన ప్రతినిధులతో చర్చించి, వారికి నమ్మకం కలిగించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అని అన్నారు. సమస్యను మొగ్గలో తుంచి వేయకుండా, పెంచి పెద్దది అయ్యే వరకు ఎవరు రారని, కాపుల విషయంలో అదే జరిగిందన్నారు. గత సంవత్సరం కాపులను బిసిల్లో చేరుస్తామని టిడిపి చెప్పిందని, అది కాకపోవడంతో వారిలో అసహనం పెరిగిందన్నారు. భారతదేశంలో గ్లోబలైజేషన్ తర్వాత గుర్తింపు రాజ కీయాలు పెరిగాయని, కాబట్టి రాజకీయ పార్టీలు బాధ్యతగా మాట్లాడాలని, లేకపోతే సామాజిక అరాచ కత్వం పెరిగిపోతుందని సూచించారు. తాను ఏ కులాని కో చెందిన వ్యక్తిని కాదని, దేశ సమగ్రత కోసం రాజ కీయాల్లోకి వచ్చిన వ్యక్తినని ఒక ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానంగా చెప్పారు. రోహిత్ ఘటన దురదృష్టకర మని, ఒక ఆలోచనాపరుడు, ఆత్మ హత్య చేసుకునే పరి స్థితి రావడం శోచనీయ మన్నారు. అయితే యూనివర్శి టీకి సంబంధించి స్థానిక వ్యవ హారాన్ని జాతీయ స్థాయి కి తీసుకువెళ్ళడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ లేఖ వల్లే ఈ ఘటన జరిగిందనే ఆరో పణలపై ప్రశ్నించగా, అలా లేఖ రాయడం దత్తాత్రేయ తో మొదలు కాలేదని, అంతకుముందు కూడా రాశా రని అన్నారు. ఎన్నికలకోడ్ ఉన్నందున జిహెచ్‌ఎంసి ఎన్నికల గురించి తానేమి వ్యాఖ్యానించబోనన్నారు.