Home తాజా వార్తలు ఎపి సిఎస్ పదవీ కాలం పొడిగింపు

ఎపి సిఎస్ పదవీ కాలం పొడిగింపు

AP has extended tenure of cs sameer sharma by 6 months

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీ కాలం మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో సిఎస్ సమీర్ శర్మ మరో 6 నెలల పాటు అంటే ఈ ఏడాది నవంబరు 30వ తేదీ వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు సిఎస్ సర్వీసును గతంలో కేంద్రం 6 నెలల పాటు పొడిగించించింది. తాజాగా మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ఎపిలో మొదటి సారి ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన అధికారిగా సిఎస్ సమీర్ శర్మ గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో యూపి, బీహార్ సిఎస్ లకు మాత్రమే కేంద్రం ఇలాంటి అవకాశం ఇచ్చింది. ఎపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీర్ శర్మ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జగన్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కేంద్రం సిఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు అంటే నవంబర్ 30 వరకు పొడిగించేందుకు అంగీకరించింది. ఈ మేరకు డివొపిటి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

AP govt has extended tenure of cs sameer sharma by 6 months