Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా…. హెడ్ కానిస్టేబుల్ మృతి

మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా…. హెడ్ కానిస్టేబుల్ మృతి

AP Minister Balineni Escort Vehicle Rollover on ORRహైదరాబాద్ : ఎపి మంత్రి బాలినేని కాన్వాయ్ లోని ఓ ఎస్కార్ట్ వాహనం కోహెడ ఒఆర్ఆర్ పై బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎస్కార్ట్ వాహనం టైరు పంక్చర్ కావడంతో బోల్తా పడింది. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మంత్రి బాలినేనికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.