Home జాతీయ వార్తలు శ్రీవారిని దర్శించుకున్న ఎపి మంత్రులు

శ్రీవారిని దర్శించుకున్న ఎపి మంత్రులు

AP Ministers Visited Tirumala

తిరుమల : తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఎపి ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, మంత్రులు జవహర్, సుజయకృష్ణా రంగారావు, నక్కా ఆనంద్‌బాబు౮ తదితరులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనం పలికి శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. సోమవారం సాయంత్రం తిరుపతిలో ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ధర్మపోరాట సభ జరగనుంది. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు.

AP Ministers Visited Tirumala