Home తాజా వార్తలు ఎపి నంది అవార్డుల ప్రకటన

ఎపి నంది అవార్డుల ప్రకటన

Nandi-Awards

అమరావతి : 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఎపి ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. 2014లో ఉత్తమ చిత్రంగా లెజెండ్ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నందమూరి బాలకృష్ణ ఎంపికయ్యారు. ఇదే సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ద్వితీయ చిత్రంగా మనం, తృతీయ చిత్రంగా హితుడు ఎంపికయ్యాయి. 2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా లౌక్యం ఎంపికైంది. ఉత్తమ నటిగా గీతాంజలి చిత్రంలో నటించిన అంజలి ఎంపికైంది. ఉత్తమ విలన్‌గా లెజెండ్‌లో నటించిన జగపతిబాబు ఎంపికయ్యారు. 2015వ సంవత్సరానికి సంబంధించి ఉత్తమ చిత్రంగా బాహుబలి-1 ఎంపికైంది. 2015వ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా శ్రీమంతుడులో హీరోగా నటించిన మహేష్‌బాబు ఎంపికయ్యారు. 2016వ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా పెళ్లి చూపులు ఎంపికగా, ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్‌టిఆర్ ఎంపికయ్యారు. 2015 సంవత్సరానికి ఎన్‌టిఆర్ జాతీయ అవార్డుకు దర్శకుడు కె.రాఘవేంద్రరావు, 2016వ సంవత్సరానికి హీరో రజనీకాంత్, 2015వ సంవత్సరానికి బిఎన్‌రెడ్డి జాతీయ అవార్డుకు త్రివిక్రమ్ శ్రీనివాస్, 2016వ సంవత్సరానికి బిఎన్‌రెడ్డి జాతీయ అవార్డుకు దర్శకుడు బోయపాటి శ్రీను ఎంపికయ్యారు. 2016 రఘుపతి వెంకయ్య అవార్డుకు మెగా స్టార్ చిరంజీవి  ఎంపికయ్యారు.

AP Nandi Awards Announcement