Home తాజా వార్తలు ఎపి, తెలంగాణ శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎపి, తెలంగాణ శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల

AP,-TS-MLC-Elections

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 20 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు. ఫిబ్రవరి 21న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఫిబ్రవరి 23. ఇక మార్చి 9న ఓటింగ్ నిర్వహించి, 15న కౌంటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. ఎపిలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాలకు, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి ఎన్నిక జరుగనుంది.