Home రాష్ట్ర వార్తలు అపెక్స్ కౌన్సిల్ భేటీ?

అపెక్స్ కౌన్సిల్ భేటీ?

cmఈ నెల మూడవ వారంలో ఇద్దరు సిఎంలతోనూ ఉమాభారతి సమావేశం!

హైదరాబాద్: ఆగస్టు మూడోవారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగున్నట్లు తెలిసింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి గొడవలు తీర్చడానికి కేంద్రమంత్రి ఉమాభారతి స్వ యంగా రంగంలోకి దిగుతోంది. ఆగస్టు రెండోవారం చివర, వీలుకాకపోతే మూడో వారంలోఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్య మంత్రులు నారా చంద్రబాబునాయు డు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావులతో భేటీ కానున్నట్లు సమాచారం. గోదావరిలో నీటి పంపకాలు, విని యోగంపై పెద్దగా ఆటంకాలు లేన ప్పటికీ, కృష్ణా నీటి వినియోగంలో విభేదాలు, పట్టుదల చాలా ఉన్నాయి. గత సంవత్సరంలాగే నీటిని ఇరు రాష్ట్రా లు వినియోగిం చుకోవాలని తరువాయి 10లో కృష్ణ బోర్డు అధికారులు సూచించినా, ఎవ్వరూ పట్టించుకోలేదు. నాగార్జునసాగర్ దిగువన నీటి విడుదలపై బోర్డు చెప్పినా, తెలంగాణ ప్రభుత్వం వినడం లేదని ఎపి అధికారులు బాధపడుతున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు పట్టించుకో కుండా నీటిని కిందకు వదలలేమని బోర్డుకు తెలంగాణ అధికారులు గట్టిగానే సమాధానమిచ్చారు. శ్రీశైలం నుంచి వదిలితే సాగర్ నుంచి వదులుతామని ఎపికి సూచించగా, 10 టిఎంసిల నీటిని కిందకు వద లాలని కృష్ణాబోర్డు ఆదేశాలిచ్చింది. ఇందులో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 3 టిఎంసిలను కేటాయించగా, 7 టిఎంసిలకు నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా వదిలితే ప్రకాశం, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాలు తీరతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు నీటి విడుదల ప్రారంభమైంది. ఇది అత్యవసరాలకని కెఆర్‌ఎంబి తీసు కున్న నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పాటిస్తున్నా, భవిష్య త్తులో ఇదే రీతిలో పాటిస్తారన్న నమ్మకాలు లేవు. దీంతో పాటు ఆర్‌డి ఎస్ ఆధునీకరణ, ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు ఆంధ్రప్రదేశ్ సహ కరించకపోవడం మూలంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సీజన్ దాటిపోయింది. నీరు వృధాగా పోయింది. ఇప్పుడు పుష్కరా లకు సమృద్ధిగా నీటి లభ్యత లేదు. కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలోనే కొద్దోగొప్పో నీరు ఉంది. ఈ పది రోజుల్లో నీరు చేరుతుందో లేదో వేచిచూడాలి. ఎగువన ఆల్మట్టి, నారా యణపూర్ డ్యాంలు నిండడం సంతోషకరం. అయినా తుంగభద్ర డ్యాంలో ఇంకా నీరు రావాల్సివుంది. ప్రస్తుతానికి జూరాల నిండినా, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు నీటి కోసం ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్నాయి. కృష్ణా నది నీటి పంపకాల కోసమని కృష్ణా బోర్డు ఇప్పటికి రెండు మార్లు భేటీ అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లు పరస్పర వ్యతిరేక వాదనలతో వాతావరణాన్ని వేడెక్కించడంతో తుది నిర్ణయానికి రాలేదు. దీనికితోడు ప్రాజెక్టులపై ఆజమాయిషీ చేయాలని బోర్డు అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్రానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకతతో ప్రస్తుతానికి ప్రాజెక్టులపై బోర్డు పెత్తనంపై నోటిఫికేషన్ ఆగినా, ప్రమాదం పొంచేవుంది. వీటన్నింటి నేపధ్యంలో ఆగస్టు రెండోవారం, లేదా మూడో వారంలోనే ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అఫెక్స్ కౌన్సిల్‌కు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు ఉంటారు. బోర్డు నిర్ణయాలపై ఉన్న అభ్యంతరాలు కూడా అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించే సౌలభ్యం చట్టంలో ఉంది. ఈ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయంతో నీటి పంపకాలు చేసుకోవాల్సి ఉంటుంది.