Wednesday, April 24, 2024

సోషల్ మీడియాలో నకిలీ వార్తల ప్రసారంపై అపోలో ఖండన…

- Advertisement -
- Advertisement -

Apollo hospital

 

మన తెలంగాణ/హైదరాబాద్: కోవిడ్19 సంక్రమణతో నగరంలోని రెండు ప్రాంతాల నుంచి అపోల్ హాస్పిటల్స్, జూబ్లీహిల్స్‌లో 150 మంది రోగులు చేరినట్లు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో సమాచారం వెలువడుతోందని అది అబద్ధమని అపోలో హాస్పిటల్స్ స్పష్టం చేసింది. నిజాయితీ లేని ఉద్దేశాలతో నకిలీ వార్తల ప్రసారాన్ని తాము ఖండించడమే కాకుండా ఇందుకు సంబంధించి అధికారులకు ఫిర్యాదులు చేశామని అపోలో హాస్పిటల్స్ సీఈవో వై సుబ్రమణ్యం తెలిపారు. సంక్షోభ సమయంలో కోవిడ్19 రోగులను కలిగి ఉండటానికి, నిర్వహించడానికి ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఆసుపత్రికి దూరంగా 50 పడకలతో కూడిన కోవిడ్19 యూనిట్ సృష్టించ బడిందన్నారు. పుకార్లు వ్యాప్తి చెందడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, తమ రోగులకు.. తమ సంస్థ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉన్నా మన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News