Home తాజా వార్తలు దరఖాస్తులు 43వేలు

దరఖాస్తులు 43వేలు

 liquor shops

 

మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తు రుసుం నుంచే ప్రభుత్వానికి రూ. 860కోట్ల ఆదాయం
2,216 షాపులకు 18న లాటరీ పద్ధతిలో లైసెన్సుల కేటాయింపు

హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి 20 వరకు దరఖాస్తులు వచ్చాయి. రెండేళ్ల కిందటి కంటే ఈసారి అధికంగా టెండర్ దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా గతంలో వచ్చిన 41 వేల దరఖాస్తుల కంటే ఈసారి
43 వేలు దాటిందని సమాచారం. దీంతో ప్రభుత్వానికి ఒక్కొ మద్యం దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున రూ.860 కోట్ల పైన ఆదాయం సమకూరినట్లు సమాచారం. గడువు సమయంలోపు కార్యాలయానికి వచ్చిన వ్యాపారులు క్యూలో నిలబడి దరఖాస్తులు ఇచ్చారు.

రాష్ట్రంలోని 33 జిల్లాలలోని 2216 మద్యం దుకాణాల ఏర్పాటుకు చేసేందుకు ఈ నెల 9న ప్రారంభమైన మద్యం దుకాణాలకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది. మంగళవారం నాటికే 20,630 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.412.60 కోట్లు ఆదాయం వచ్చింది. చివరిరోజున ఏకంగా 22 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఈ నెల 18న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తారు.

రాష్ట్రంలో మద్యం షాపులకు బంధువులు, స్నేహితుల ద్వారా ఎపి వ్యాపారులు కూడా టెండర్లు వేసినట్లు అధికారులు పేర్కొందన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి డివిజన్‌లలో అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 2017లో 41 వేల దరఖాస్తులు రావడంతో దరఖాస్తు రుసుం కింద రూ.లక్ష చొప్పున మొత్తం రూ.411 కోట్ల రాబడి వచ్చింది. అయితే ఈసారి రుసుం రూ.2 లక్షలకు పెంచడంతో రూ. 820 కోట్ల వరకు రాబడి వచ్చినట్లు సమాచారం.

మద్యం సిండికేట్ల అడ్డుకట్టకు మార్గదర్శకాలు
రాష్ట్రంలో మద్యం సిండికేట్లను నిలువరించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబర్ ఒకటి నుంచి మొదలయ్యే మద్యం క్రయ విక్రయాలు పారదర్శకంగా జరిగేలా కఠిన నిబంధలను తీసుకొచ్చింది. సిండికేట్ల రూపంలో మద్యం విక్రయాలు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, అనైతిక మార్గాల్లో వ్యాపారం చేసే వాళ్ల పై కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎంఆర్‌పి కంటే తక్కువ రేట్లకు మద్యం అమ్మితే ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించనున్నది.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, లైసెన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలంగాణా ఎక్సైజ్ చట్టం సెక్షన్ 36బి, 41ల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎక్సైజ్ శాఖ తరపున మరో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అపరాధ రుసుమును వసూలు చేయనున్నది. ఇక దరఖాస్తుదారులను బెదిరించే సిండికేట్ మాఫియాను అదుపులోకి తేవడానికి కూడా చర్యలు చేపట్టింది. మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో సిండికేట్‌గా ఏర్పడేందుకు కొందరు దరఖాస్తుదారులను బెదిరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ దృష్టికి వచ్చింది.

Applications are 43 thousand for liquor shops