Thursday, April 25, 2024

గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు…

- Advertisement -
- Advertisement -

Applications for Admissions in Gurukul

మన తెలంగాణ/బాన్సువాడ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని బోర్లం ఉన్నత పాఠశాల స్వేరో సర్కిల్ నాయకుడు అయ్యాల సంతోష్, సయ్యద్ అమీన్‌లు విద్యార్థులకు సూచించారు. గురువారం విద్యార్థులతో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశముందని, ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని, పేద విద్యార్థుల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ఎంతగానో బాగుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ గురుకులాల్లో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News