Wednesday, April 24, 2024

సిఎం విదేశీ విద్య పథకానికి మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

CM Foreign Education Scheme

 

హైదరాబాద్ : మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్దులకు ముఖ్యమంత్రి విదేశీ విద్యాపథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పేర్కొన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ డిగ్రీలో 60శాతం మార్కులు ఉండి పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనభ్యసించదలచిన వారు, పిజీలో 60శాతం మార్కులు వచ్చి పీహెచ్‌డి చేయాలనుకునే వారు మాత్రమే ఈపథకానికి అర్హులన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందే విద్యార్థులు ఆ గస్టు 2019 నుంచి డిసెంబరు 2019 వరకు ఎంపిక చేయబడిన విదేశి యూనివర్సిటీలలో అడ్మిషన్‌ పొంది ఉండాలని తెలిపారు. అర్హత ఉన్న విద్యార్దులు దృవపత్రాలతో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మార్చి 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాల కోసం జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయం హజ్‌హౌస్ 6వ అంతస్తులో సంప్రదించాలన్నారు.

Applications for CM Foreign Education Scheme
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News