Monday, June 5, 2023

బిసి విదేశీ విద్యానిధి పథకంలో దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

Applications

 

హైదరాబాద్: రాష్ట్రంలోని బిసి విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీలల్లో ఉన్నత విద్యాభాస్యం చేయడానికి ప్రవేశపెట్టిన జోతిబాపూలే బిసి విదేశీ విద్యానిధి పథకంలో 2019-20 ఏడాదికి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఈనెల 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు స్వీకరిస్తారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ పథకంలో బిసి, ఈబిసి వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశీ యూనిర్సిటిలో పిజి.పిహెచ్‌డి విద్యాభాస్యం చేయడానికి ఈ పథకం ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పథకంలో ఎంపికైన విద్యార్థులకు రూ.20లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు, అర్హతలు తదితర వివరాలకు వైబ్‌సైట్ www.telangana e pass.cgg.gov,inను సంప్రదించాలని ఆ ప్రకటనలో వెల్లడించారు.

Applications in BC Foreign Scholarship Scheme
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News