Home సినిమా నటనా ప్రతిభకు ప్రశంసలు

నటనా ప్రతిభకు ప్రశంసలు

rkn

యంగ్ బ్యూటీ రాశిఖన్నా ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టచ్ చేసి చూడు, తొలిప్రేమ చిత్రాలతో అందరినీ పలకరించింది. అయితే ‘టచ్ చేసి చూడు’ రాశిఖన్నాను నిరాశపరచగా ‘తొలిప్రేమ’ మాత్రం మంచి విజయాన్ని అందించి సంతోషపరిచింది. ‘తొలిప్రేమ’లో వర్ష క్యారెక్టర్‌లో ఈ భామ చక్కగా నటించి ఆకట్టుకుంది. తన గ్లామర్, నటనతో రాశిఖన్నా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక ఈ సినిమాలో హీరోతో సమానంగా ఆమె క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. అందుకు తగ్గట్టుగానే ఈ అమ్మడు కూడా మంచి నటనా ప్రతిభను చూపించందంటూ ప్రశంసలు వస్తున్నాయి. దీంతో రాశి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇక మెగా కాంపౌండ్‌లో ఈ భామ నటించిన రెండో సినిమా ఇది. తొలి సినిమాను సాయిధరమ్‌తేజ్‌తో కలిసి ‘సుప్రీమ్’లో నటించింది. ఆ సినిమాతో సూపర్‌హిట్‌ను అందుకుంది. తాజాగా వరుణ్‌తేజ్‌తో నటించిన ‘తొలిప్రేమ’ కూడా సూపర్ హిట్ టాక్ సంపాదించడంతో ఈ ఏడాది తెలుగులో ‘భాగమతి’తో ఘన విజయాన్ని అందుకున్న అనుష్క తర్వాత స్థానం రాశిఖన్నాదేనని చెప్పక తప్పదు. ఇక ‘తొలిప్రేమ’లో వరుణ్‌తేజ్, రాశిఖన్నాల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని అందరూ అంటున్నారు. గత చిత్రాలతో పోల్చితే నటనాపరంగా ఈ సినిమాలో రాశిఖన్నాలో మంచి పరిణతి కనిపించిందని ప్రశంసిస్తున్నారు. బరువైన, బలమైన పాత్ర ఈ సినిమా ద్వారా తనకు దక్కిందంటూ ఈ భామ సంతోషంగా చెప్పింది.