Saturday, April 20, 2024

నేడే రాష్ట్ర ‘బడ్జెట్’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న ఆర్థ్ధిక సంవత్సరం (2023-24) కోసం రూపొందించిన వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదివారం ప్రగతిభవన్‌లో ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్‌పై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు….వాటి కేటాయింపులు ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. అలాగే పలు బిల్లులకు కూడా కేబినెట్ ఆమో దం తెలిపినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా రూ. 3 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఉండే అవకాశం ఉందని సమాచారం. కాగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రుణాలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

కాగాఅసెంబ్లీ సమావేశాలకు మంత్రులు అందరు తప్పకుండా హాజరు కావాలని ఈ సందర్భంగా కెసిఆర్ ఆదేశించారు. కాగా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన బడ్జెట్‌ను సోమవారం (జనవరి 6) శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఉదయం 10.30 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. కాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అంటే ఈ నెల 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. దీంతో ఈ నెల 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. అదే రోజున ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పనున్నారు. ఇక ఈ నెల 9, 10, 11 తేదీల్లో పద్దులపైన చర్చ జరగనుంది. 12వ తేదీన సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చించి.. బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News