Saturday, April 20, 2024

కొలువుల ‘పండుగ’

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు చవితి కానుక

మరో 2,910 పోస్టుల భర్తీకి అనుమతులు ఇప్పటికే 49,550 ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్లు మూడు నెలల్లో 50వేల పోస్టుల మైలురాయిని దాటాం : హరీశ్

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 50వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. మూడు నెలల్లోనే 50వేల మార్క్‌ను దాటింది. మిగిలిన నోటిఫికేషన్లు త్వరలో వెలువడుతాయి. ఉద్యోగార్థులందరికీ శుభాకాంక్షలు
మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/ హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పురస్కరించుకొని 2910 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా వ్యవసాయ, పశుసంవర్ధక, గ్రూప్- 2, గ్రూప్- 3 పోస్టులు ఉన్నా యి. రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. ఇ ప్పటికే పలు శాఖల్లోని పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం విధితమే. అందులో భాగంగా గ్రూప్ -1, ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్లతో పాటు పలు ఉ ద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ 49550 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా..తాజాగా మరో 2, 910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆ సంఖ్య 52460 చేరింది. తాజాగా గ్రూప్–2 ఉద్యోగాలు663, గ్రూప్–3 ఉద్యోగాలు 1,373, పశుసంవర్ధక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50 పోస్టులు, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టుల భర్తీతో పాటు మరిన్ని పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరి కొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల నియామకాల కు నోటిఫికేషన్లు త్వరలో జారీ చేస్తామని తెలిపారు.

పోస్టుల వివరాలు ఇలా..

గ్రూప్ 2 ఉద్యోగాల్లో జిఎడి ఏఎస్‌ఓ పోస్టులు 165, పంచాయతీరాజ్ ఎంపివో పోస్టులు 125, డిప్యూటీ తహసీల్దార్ పో స్టులు 98, ఎక్సైజ్ ఎస్‌ఐ పోస్టులు 97, అసిస్టెంట్ కమర్షియ ల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 59 ఉన్నాయి. 38 చేనేత ఏడీవో పోస్టులు, 25 ఆర్థికశాఖ ఏఎస్వో పోస్టులు, 15 అసెంబ్లీ ఏఎస్వో పోస్టులు, 14 గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు, 11 గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు, తొమ్మిది ఏఎలో, ఆరు న్యాయశాఖ ఏఎస్వో పోస్టులు ఉన్నాయి. గ్రూప్ -3 ఉద్యోగాల్లో మొత్తం 99 విభాగాధిపతులు. కేటగిరీల పరిధిలో 1,373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. వ్యవసాయశాఖలో 199 గ్రేడ్ -2 ఏఈవో పోస్టులు, 148 ఏవో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉద్యానవన శాఖలో 21 హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. సహకారశాఖలో 63 అసిస్టెంట్ రిజిస్ట్రార్. 36 జూనియర్ ఇన్స్పెక్టర్పోర్టులు ఉన్నాయి. పశుసంవర్ధక శాఖలో 183 వెటర్నరీ అసిస్టెంట్ ‘సర్జన్, 99 వెటర్నరీ అసిస్టెంట్ సహా 294 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. విత్తన ధృవీకరణ సంస్థలో 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారి. ఆరు ఆర్గానిక్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. మత్య్సశాఖలో తొమ్మిది ఎల్డీవో, నాలుగు ఏడీ, రెండు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుల పరిధిలో 12 పోస్టులు, ఇంధనశాఖలో 11 సహాయ ఎలక్ట్రికల్ పోస్టులు, గిడ్డంగుల సంస్థలో 28 ఏడబ్యూఎం. 14 మేనేజర్ సహా 50 పోస్టుల భర్తీకి తాజాగా అనుమతి ఇచ్చింది.

50కె మైలురాయిని దాటాం : హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన వాగ్దానం మేరకు గడిచిన మూడు నెలల్లో 52,460 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదల చేశాం. గ్రూప్-2, గ్రూప్ -3తో సహా 2910 పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని ట్వీటర్‌లో మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భారీ ఎత్తున్న జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో 50కె మైలురాయిని దాటిందన్నారు. మిగిలిన నోటిఫికేషన్లు త్వరలో జారీ చేయబడతాయి. ఉద్యోగార్థులందరికీ శుభాకాంక్షలని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత నాయకత్వంలో ఇప్పటి వరకు ఆర్థిక శాఖ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 52460 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు.

ఖాళీల వివరాలు

గ్రూప్ 2 663

గ్రూప్ 3 1,373

వ్యవసాయ కమిషనర్ 347

వ్యవసాయ డైరెక్టర్ మార్కెటింగ్ 12

డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ 21

కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ 99

విత్తనం, ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ 25

టిఎస్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ 50

చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ 11

ఫిషరీస్ కమిషనర్ 15

పశుసంవర్ధక 294

మొత్తం 2,910

గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 1,654 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్ విద్యాశాఖ అనుమతిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఖాళీగా ఉన్న రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ పోస్టుల స్థానంలో పార్ట్‌టైం పద్దతిలో గెస్ట్ ఫ్యాకల్టీని నియమించుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News