Home తాజా వార్తలు కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య

APSP constable commits suicide with family quarrels

 

భద్రాద్రి కొత్తగూడెం: కుటుంబ కలహాలతో ఎపి ఎస్పి కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇల్లందు జేకే కాలనీ సింగరేణి క్వార్టర్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇల్లందు జేకే కాలనీ సింగరేణి క్వార్టర్ లో నివాసం ఉంటున్న ఎపి ఎస్పి కానిస్టేబుల్ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెంలో విధులు నిర్వహిస్తున్నాడు. గత సంవత్సర కాలంగా విధులకు హాజరు కాకుండా మద్యం తగుతూ భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడని రాంబాబు భార్య ఇల్లందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో రాంబాబుపై హరాస్మెంట్ కింద కేసు నమోదు చేశారు. మనస్తపానికి గురైన రాంబాబు తను ఉన్న క్వార్టర్ లోనే ఉరి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.

APSP constable commits suicide with family quarrels