Home మంచిర్యాల వెలుగు చూడనున్న వెయ్యేళ్ల చరిత్ర!

వెలుగు చూడనున్న వెయ్యేళ్ల చరిత్ర!

గోదావరి తీర ప్రాంతంలో శాతవాహనుల ఆనవాళ్లు
మంచిర్యాల జిల్లా కర్ణమామిడి శివారులో పురావస్తుశాఖ తవ్వకాలు
గతంలోనే బయల్పడిన పురాతన వస్తువులు

                   100-Years

మంచిర్యాలటౌన్: మంచిర్యా ల జిల్లా సరిహద్దు నుంచి ప్రవహిస్తున్న జీవనది గోదావరి తీర ప్రాంతంలో శాతవాహనుల ఆనవాళ్ల ను వెలుగులోకి తెచ్చేందుకు పురావస్తు శాఖ కృషి చే స్తోంది. హాజీపూర్ మండలం పరిధిలోని కర్ణమామిడి శివా రు గోదావరి నది పరివాహక ప్రాంతంలో మంగళవారం తవ్వ కాలు మొదలు పెట్టింది. స్థానిక ఎంఎల్‌ఎ నడిపెల్లి దివాకర్‌రావుతో పాటు కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పురా వస్తుశాఖ డైరెక్టర్ విశాలాక్షి మాట్లాడుతూ 60 ఏళ్ల చరిత్రలో మొదటిసారి పు రావస్తుశాఖ తవ్వకాలను చేపట్టినట్లు తెలిపారు. శాతవాహన కాలం నాటి పు రాతన వస్తువులు గతంలో బయటపడ్డాయని గుర్తుచేస్తూ, వీటి కోసం ఆరు నె లలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

సుమారు వెయ్యేళ్ల క్రితం చరిత్ర తవ్వకాల ద్వారా వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కర్ణమామిడి గ్రామ గోదావరి తీర ప్రాంతం నుంచి చూస్తే అప్పటి శాతవాహనుల రాజధాని పిలిచే కోటి లింగాల గ్రామం కనిపిస్తుందన్నారు. గతంలో తవ్వకాల కోసం ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నించినా అనుమ తి రాలేదని, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అను మతి ఇవ్వడంతో తవ్వకాలను ప్రారంభించి నట్లు వెల్లడించారు. వందేళ్ల మట్టి పొరల ను తొలగించిన తర్వాత శాతవాహను ల కాలం నాటి ఆనవాళ్లు కనిపించే వ రకు తవ్వకాలను కొనసాగిస్తామని, ప్రస్తుతం దాదాపు రెండు నెలల వర కు పనులు సాగుతాయన్నారు.

పురావస్తుశాఖకు పూర్తి సహకారం శాతవాహనుల కాలం చరిత్రను వెలు గులోకి తెచ్చేందుకు పురావస్తు శాఖ చేప ట్టిన తవ్వకాలకు పూర్తి సహాయ, సహకా రం అందిస్తామని స్థానిక ఎంఎల్‌ఎ నడిపెల్లి దివాకర్‌రావుతో పాటు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఆర్కియాలజిస్టు ప్రభుత్వ అనుమతితో తవ్వకా లను నిర్వహిస్తున్నారని, తవ్వకాలు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. నది ప్రాంతంలో బోట్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

సుమారు 2వేల ఏళ్ల క్రితం ఆనవాళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయని పేర్కొంటూ పరిసరా ప్రాంత ప్రజలు తవ్వకాలకు సహకరించాలని కోరారు. తవ్వకాల్లో దేవాలయాలు బయటపడితే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మనాభ, అసిస్టెంట్ డైరెక్టర్ రాములునాయక్, టెక్నికల్ అసిస్టెంట్లు బుజ్జి,మంగ, కేర్ టేకర్స్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.