Home తాజా వార్తలు వేడి గాలుల వాడికి కరుగుతున్న మంచు ఖండాలు

వేడి గాలుల వాడికి కరుగుతున్న మంచు ఖండాలు

greenlandస్టాక్‌హోల్మ్ : మంచుఖండాలు కరిగి సముద్రమట్టాలు పెరిగి విపరీతాలకు దారి తీసే వేడిగాలులు ఇప్పుడు ఐరోపా దాటి గ్రీన్‌లాండ్ వైపునకు మళ్లుతున్నాయని, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఐరోపాలో రికార్డు స్థాయిలో పెరిగిన వేడి గాలులు ఇప్పుడు ఆర్కిటిక్ వైపు మళ్లు తున్నాయి. ఈ వేడి గాలుల తీక్ష ప్రభావానికి శక్తికి మంచు కరిగిపోతుందని, ఆర్కిటిక్ సముద్రంపై ఉంటే మంచుఖండాలు వేగంగా కరిగిపోతాయని డేనిష్ మెటెయోరాలజికల్ ఇనిస్టిట్యూట్ (డిఎంఐ) శాస్త్రవేత్త రుత్‌మెట్ట్రామ్ హెచ్చరించారు. ఈ వేడి ఇప్పుడు వేసవికి తోడవుతుంది. ఐరోపాలో మంచుకరిగే సీజన్ ఈఏడాది ఇప్పటికే ప్రారంభమైంది. వేడి ఇలాగే స్థిరంగా ఉంటే మంచు ఖండాలు భారీ ఎత్తున క్షీణిస్తాయి.

డిఎంఐ కంప్యూటర్ నమూనాల ప్రకారం జులై 1 నుంచి 26 వరకు కరిగే మంచు ఖండాల నుంచి 170 గిగా టన్నుల నీరు సముద్రాల్లోకి చేరుతుంది. ప్రతి వంద గిగా టన్నుల మంచు కరిగితే ఆ నిష్పత్తిలో సముద్రాల నీటి మట్టం 0.28 మి.మీ వరకు పెరుగుతుందని, అంచనా. ఈ లెక్కన 60 నుంచి 80గిగాటన్నుల మంచు కరుగుతుందని చెబుతున్నారు. ఈ మంచుఖండాలు కరగడం ఏటేటా పెరగడం పరిపాటి అయింది. ఈ ఏడాది గ్రీన్‌ల్యాండ్ మంచు కరగడం 2012 నాటి రికార్డు స్థాయిలో ఉండవచ్చన్న భయాందోళనలు కలుగుతున్నాయి. 2012 వేసవిలో అసాధారణ పరిస్థితి సంభవించింది.తీవ్రస్థాయిలో మంచుఖండాలుకరిగాయి.

సముద్రంపై 3000 మీటర్ల పొడవునా మంచు ఖండం కరిగిందని మెట్ట్రం చెప్పారు. అయితే ఇంతవరకు ఆ విధంగా మంచు కరిగే పరిస్థితి కనిపించక పోయినా గ్రీన్‌ల్యాండ్‌కు వేడిగాలులు సమీపిస్తుండడంతో 2012 నాటి పరిస్థితి మళ్లీ ఎదురుకాగలదని భయపడుతున్నారు. మంచు సాధారణ స్థాయికి మించి పెరగడం గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. గ్రీన్‌ల్యాండ్ మంచు కరగడానికి భూతాపం పెరగడానికి అవినాభావ సంబంధం ఉంది. దీనివల్ల భూతాప అమాంతంగా పెరిగిపోతాయి.

Arctic to be hit by record heat wave from Europe