Home తాజా వార్తలు కాంగ్రెస్ ఎంఎల్‌ఎల సభ్యత్వ రద్దు పిటిషన్‌పై ముగిసిన వాదనలు

కాంగ్రెస్ ఎంఎల్‌ఎల సభ్యత్వ రద్దు పిటిషన్‌పై ముగిసిన వాదనలు

AP-HIGH-COURT

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వ రద్దు పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో సోమవారం ప్రభుత్వం కౌంటర్‌ను దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదనాలు వినిపించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది జంధ్యాల వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గత నెలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైక్ విసరడంతో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. నాడు ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ ఎంఎల్‌ఎలు ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు.

Arguments Complete on Congress MLAs Petition in High Court