Home తాజా వార్తలు ‘అర్జున్ రెడ్డి’ సినిమా డైరెక్టర్ ఇంట విషాదం…

‘అర్జున్ రెడ్డి’ సినిమా డైరెక్టర్ ఇంట విషాదం…

Sandeep-Reddy-Vanga
 
హైదరాబాద్: టాలీవుడ్ యువ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇంట విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్ తల్లి వంగ సుజాత గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ముంబయిలో ఉన్న సందీప్ ఇవాళ వరంగల్ కు వెళ్లారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సిన్మాల తర్వాత సందీప్ రెడ్డి ఇండస్ట్రీ లో బిజీ గా మారారు.  అయితే ఆయన ఇంకా తన తదుపరి సిన్మాను ప్రకటించలేదు. ప్రభాకర్ రెడ్డి, సుజాత దంపతులకు సందీప్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి అనే పిల్లలు ఉన్నారు. వీరి స్వస్థలం వరంగల్. కాగా, వంగ సుజాత అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరిగే అవకాశముందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
 
 
Arjun Reddy Cinema Directors Mother Passed away
 
 
Arjun Reddy Cinema Director’s Mother Passed away