Wednesday, April 24, 2024

బ్యాడ్మింటన్ మాంత్రికుడు పిచ్చయ్య కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Arjuna Award recipient Jammalamadaka Pitchaiah passed away

మనతెలంగాణ / హైదరాబాద్ / వరంగల్ కార్పొరేషన్ : ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డ్ గ్రహీత జమ్మలమడక పిచ్చయ్య కన్నుమూశారు. వరం గల్ దేశాయిపేటకు చెందిన పిచ్చయ్య కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ నెల 21న ఆయన 104వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నా రు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చయ్య ఆదివారం మధ్యాహ్నం మేనల్లుడి ఇంట్లో తుదిశ్వాస విడిచినట్టు సన్నిహితులు తెలిపారు. పిచ్చయ్య బాల్ బ్యాడ్మింటన్‌లో అంచెలంచెలుగా రాణించి జాతీయస్థాయికి ఎదిగారు. తన ఆటతో దేశానికి పేరు తీసుకువచ్చారు. ఈక్రీడలో తొలి అర్జున అవార్డు అందుకుని తరువాత తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. 1918 డిసెంబర్ 21న కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో పున్నయ్య,-నాగమ్మ దంపతులకు ఏడుగురు సంతానంలో మూడో అబ్బాయిగా జన్మించారు. ఆయన తండ్రి మచిలీపట్నంలో స్థిరపడడంతో బందర్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు.

అయితే పదో తరగతి తప్పడంతో ఇంట్లో ఖాళీగా ఉండలేక బందరు పట్టణం లో మినర్వ క్లబ్, మోహన్‌క్లబ్‌లో బాల్ బ్యాడ్మింటన్ ఆడడం అలవాటు చేసుకున్నారు. అప్పట్లో ఈఆటను సంపన్నవర్గాల వారు ఆడేవారు. అయినా ఎలాగైనా నేర్చుకోవాలని పట్టుదలతో ముందుకు సాగారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించారు. ఆటలో తనకంటూ ప్రత్యేకమైన గురువు, శిక్షణ లేకపోయినా ఏకలవ్యుడిలా సాధన చేసి ఆటపై పట్టు సాధించారు. ఆయన ఆట తీరును చూసిన కొన్ని ప్రైవేటు క్లబ్‌ల నిర్వాహకులు ఆయాక్లబ్‌ల తరపున ఆడాలని ప్రోత్సహించేవారు. 1935–_-36లో నర్సారావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. పెళ్లి అయిన తరువాత ఉద్యోగం చేయడానికి కొన్నాళ్లు ఆటను వదిలేసిన ఆయన మళ్లీ పునరాగమనం చేసి 1947_-48 లో గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. 1950 దశకంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాల్గొనలేకపోయిన ఆయన 1954_-55లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయిలో పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అనంతరం మద్రాస్, పాండిచ్చేరిలో 1956, 1957 సంవత్సరాల్లో జరిగిన జాతీయ పోటీల్లో జట్టును గెలిపించారు. ఆసమయంలో జట్టుకు కెప్టెన్‌గా ఎన్నికయ్యా రు. తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పా టు ఇతర రాష్ట్రాల్లో జరిగిన 15 జాతీయస్థాయిలో పోటీల్లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించి 9 చాంపియన్‌షిప్‌లను గెలిపించారు. 1945లో వరంగల్‌లో ఆజాంజాహి వర్కర్స్ యూనియన్‌లో నెలకు రూ.50 వేతనంతో పిచ్చయ్య ఉద్యోగం సంపాదించారు. బాల్ బ్యాడ్మింటన్‌లో ఎన్నో ఘనతలు సాధించిన పిచ్చయ్యకు భారత ప్రభుత్వం 1970లో అర్జున అవార్డును ప్రకటించింది. అయితే 1971లో పాకిస్తాన్ యుద్ధం కారణంగా ఆసంవత్సరం అవార్డును అందుకోలేకపోయారు. 1972లో అప్పటి భారత రాష్ట్ర పతి విపి గిరి చేతులమీదుగా ఢిల్లీలో అవార్డు స్వీకరించారు. పిచ్చయ్యకు భార్య సత్యవతి, కుమార్తెలు సుశీల, జానకీదేవిలున్నారు. 2007లో భార్య మృతిచెందగా ఆయన ఆధ్యాత్మిక చింతనలో సమయం గడుపుతున్నారు.

ప్రముఖుల సంతాపం

పిచ్చయ్య మృతికి క్రీడల, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. ‘105 మినిట్స్’ పేరుతో పిచ్చయ్య క్రీడా జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధగా ఉందని దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం క్రీడాలోకానికి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. బాల్ బ్యాడ్మింటన్ లో రాష్ట్రం నుంచి ఎందరినో రాష్ట్ర, జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో అర్జున్ పిచ్చయ్య విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ నెల 21న తన 104 పుట్టినరోజు చాలా ఉత్సాహంగా జరుపుకొన్నారని మంత్రి తెలిపారు. అర్జున పిచ్చయ్య అకాల మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News