Wednesday, April 24, 2024

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి మృతి

- Advertisement -
- Advertisement -

Army Colonel Santosh

హైదరాబాద్‌ః లద్దాఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి భారత్-చైనా జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, మృతిచెందిన ముగ్గురు సైనికుల్లో సూర్యాపేట వాసి కల్నల్ ర్యాంకు అధికారి బి. సంతోష్ కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాత కల్నల్ సంతోష్ చనిపోయిన విషయంపై ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. కల్నల్ సంతోష్‌కు భార్య సంతోషి, కూతురు(9), కుమారుడు(4)లు ఉన్నారు.

బిహార్ 16వ బెటాలియన్‌లో పనిచేస్తున్న కల్నల్ సంతోష్ .. ఏడాదిగా చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, మూడు నెలల క్రితమే హైదరాబాద్‌కు బదిలీ అయిన సంతోష్.. లాక్‌డౌన్ కారణంగా చైనా సరిహద్దులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇరు వర్గాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు భారత జవాన్లతోపాటు కల్నల్ సంతోష్ కుడా అమరుడయ్యారు.

Army Colonel Santosh died in India-China clashes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News