Home జాతీయ వార్తలు కెప్టెన్‌కు సెక్స్ సతాయింపు.. మేజర్ జనరల్‌పై బర్తరఫ్ వేటు

కెప్టెన్‌కు సెక్స్ సతాయింపు.. మేజర్ జనరల్‌పై బర్తరఫ్ వేటు

Sexual-harassmentసైనిక చీఫ్ నిర్ధారణ ఉత్తర్వులు,  బలి చేశారంటున్న మేజర్

న్యూఢిల్లీ : కెప్టెన్ ర్యాంక్ మహిళా సైనికాధికారిని లైంగికంగా వేధించారనే అభియోగాలపై మేజర్ జనరల్ ర్యాంక్ అధికారిపై వేటు పడింది. అస్సాం రైఫి ల్స్ విభాగంలో విధులలో ఉన్న ఆయనకు బర్తరఫ్ శిక్షను విధించిన విషయాన్ని భారత సైనిక దళ అధిపతి బిపిన్ రావత్ శుక్రవారం నిర్థారించారు. రెండేళ్ల క్రితం నాటి లైంగిక వేధింపుల కేసుపై ఆర్మీ జనరల్ కోర్టు మార్షల్ (జిసిఎం) గత ఏడాది డిసెంబర్ 23వ తేదీననే తీర్పు వెలువరించింది. ఆయనను సర్వీసు నుంచి తొలిగించాలని, పింఛన్ కూడా ఇవ్వవద్దని సిఫార్సు చేసింది.

ఆరోపణలకు గురైన ఉన్నతాధికారికి కోర్టు మార్షల్ నుంచి వెలువడ్డ శిక్షను తెలియచేశారు. శిక్షకు గురవుతున్నది మేజర్ జనరల్ స్థాయి అధికారి కావడంతో నిర్ణయాన్ని అంబాలాలోని 2 కార్ప్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎంజెఎస్ కహ్లోన్‌కు సమాచారం అందించారని సైనిక అధికారులు వార్తాసంస్థకు తెలిపారు. శిక్ష ఆదేశాల నిర్థార ణ పత్రాలపై ఆర్మీ చీఫ్ గత నెలలోనే సంతకాలు చేశారు. అయితే ఆర్మీ చీఫ్ నిర్ణయం, ఉత్తర్వుల జారీ అక్రమం అని మేజర్ జనరల్ తరఫు లాయర్ స్పందించారు. ఇప్పటివరకూ తమ క్లయింట్‌కు కోర్టు మార్షల్ విచారణ ప్రక్రియ వివరాలను తెలియచేయలేదు.

శిక్ష నిర్థారణకు ముందు నిందితుడికి విచారణ వివరాలు తెలియచేయాలని ఢిల్లీ ఆర్మీ ట్రిబ్యునల్ వారు ఆదేశించారని లాయర్ గుర్తు చేశా రు. అయితే ఇందుకు విరుద్ధంగా శిక్షను నిర్థారించ డం దారుణం అని లాయర్ స్పందించారు. ట్రిబ్యున ల్ ఆదేశాల గురించి ఆర్మీచీఫ్‌కు తెలుసునని, అయినప్పటికీ శిక్షను నిర్థారిస్తూ ఉత్తర్వులు వెలువరించారని, దీనిని తాము సవాలు చేస్తామని న్యాయవాది ప్రకటించారు. శిక్షకు గురైన మేజర్ జనరల్ ఈశాన్య ప్రాంతంలో విధులలో ఉన్నప్పుడు 2016 ప్రాంతంలో వెస్టర్న్ కమాండ్‌లో విధులలో ఉన్నప్పుడు తమ సహచర ఉద్యోగినిని లైంగికం గా వేధిస్తూ వచ్చారనే ఆరోపణలు రావడం అంచెలంచెలుగా విచారణకు దారితీసింది.

తనపై కెప్టెన్ స్థాయి అధికారిణి చేసిన ఫిర్యాదు దురుద్ధేశపూరితం అని మేజర్ జనరల్ విన్నవించుకున్నారు. ఆర్మీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. సైనిక దళాల ఉన్నతస్థాయిలో నెలకొన్న వర్గపోరుకు తాను బలి అవుతోన్నట్లు తెలియచేసుకున్నారు.ఆర్మీచీఫ్ నియామక దశలో తలెత్తిన వివాదానికి తనపై వచ్చిన ఈ అభియోగాలకు సంబంధం ఉందని, ఆ తరువాతి విచారణ క్రమం కూడా అక్రమంగా ఉందని తెలియచేసుకున్నారు.

Army Dismissed Major General for Sexual harassment