Home జాతీయ వార్తలు పతకాల కోసం ఎంత పతనం!

పతకాల కోసం ఎంత పతనం!

  • అమాయకులను ఉగ్రవాదులుగా ముద్రవేసి కాల్చి చంపే అమానుషం
  • కేంద్ర రిజర్వ్ పోలీస్ ఐజి వెల్లడించిన భయంకర వాస్తవం
  • మార్చి 30న అసోం పోలీసులు, సైన్యం బూటకపు ఎన్‌కౌంటర్ దారుణోదంతం

Protest-Army

కిసలయ్ భట్టాచార్జీ (జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్)
జవాన్లకు వేర్వేరు సాహస అవార్డులను ఇస్తారు. అన్నిటికీ చివర్లో ‘చక్ర’ ఉంటుంది. ఒక్కొక్క అవా ర్డుకు పాయింట్లు కేటాయిస్తారు. అయితే ‘చక్ర’ రావడం ఎలా? ప్రజల్ని చంపాలి. పాయింట్లు పెంచుకోవాలి. ర్యాంకుల్లో ఎదగాలి. ఈ మొత్తం వ్యవహారం లో బలి అయ్యేది నిజం! అసోంలో మార్చి 30న సై న్యం, పోలీసులు కలిసి సాగించిన నకిలీ ఎన్‌కౌంటర్ గురించి కేంద్ర రిజర్వ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రజ నీస్ రాయ్ ఇటీవల పై అధికారులకు లేఖ రాశారు. రాజ్యం సాగించే హింస వెనుక గూడుపుఠాణిని ఈ లేఖ పట్టి ఇస్తుందన్న గ్యారంటీ లేదు. నకిలీ ఎన్‌కౌంటర్ పేరిట సాగే హింసాకాండ రుజువవదు కాబట్టి శిక్ష లకు అతీతం. ఇటువంటి వ్యవహారాలు బయటపెట్టే రజనీస్ రాయ్ వంటి వారి జనహిత చొరవ (విజిల్ బ్లోయింగ్) కు వారి సంక్షేమం, కెరీర్ బలవుతుందే తప్ప ఎటువంటి చక్ర’ రాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. గువహతిలోని ఎన్‌హెచ్ 31లో బైహాత చర్యాలి కూడలి నకిలీ ఎన్‌కౌంటర్లకు బలయ్యే బాధితుల మార్పిడికి పేరు పొందింది. మారుతి కార్లల్లో ఈ బదిలీ సాగుతుంది. ఎందుకంటే మారుతి తలుపు స్లైయిడ్ పద్ధతిలో తెరుచుకుంటూ ప్రయాణీకుల మార్పిడికి అనువుగా ఉంటుంది. ఈ తతంగంలో ఒక మారుతి నుంచి మరో మారుతికి నకిలీ ఎన్‌కౌంటర్‌లో హతుడు కాబోతున్న వ్యక్తిని మార్చుతారు. సాధారణంగా ఆ ప్రాంతంలో పనిచేసే వివిధ భద్రతా బలగాలు ఉమ్మడిగా పనిచేసి శాంతి స్థాపనకు పాటుపడాలి. అయితే మిలిటెంట్ నో , చిన్న దొంగనో లేదా అక్రమ వలసదారునో పట్టుకొని నకిలీ ఎన్‌కౌంటర్‌కు బలి చేసే ఆనవాయితీ యధేచ్ఛగా సాగుతోంది. ఎక్కడ, ఏ సమయానికి నకిలీ ఎన్‌కౌంటర్ సాగాలో సైనిక కేంద్రం నిర్ణయిస్తుంది. అంతే. పట్టుకొన్న వ్యక్తిని గుట్టు చప్పుడు కాకుండా మట్టుపెడతారు. చాలా ఏళ్లుగా బ్రహ్మపుత్ర ఒడ్డున దిగువ అస్సాం జిల్లాలు అక్రమంగా వలసలు సాగించడానికి అనువుగా ఉన్నాయి. ఆ జిల్లాలు ఒకవైపు భూటాన్‌తో, మరోవైపు బంగ్లాదేశ్‌తో సరిహద్దులు గలవి. సాయుధ బృందాలు, ఆయుధాలు ఆ ప్రాంతంలో అక్రమంగా వ్యాప్తి చెందడంతో తిరుగుబాటు అణచివేత కార్యకలాపాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దీనితో ఏర్పడిన గందరగోళం ఆధారంగా ఎన్‌కౌంటర్లు యధేచ్ఛగా సాగుతున్నాయి. ఇటీవల సిఆర్‌పిఎఫ్, సైన్యం శస్త్ర సీమ బల్, అస్సాం పోలీస్‌లతో కూడిన  ఉమ్మడి బృందం ఒక నకిలీ ఎన్‌కౌంటర్‌ను సాగించినట్లు కేంద్ర రిజర్వు పోలీసు దళం ఇనస్పెక్టర్ జనరల్ (ఈశాన్య సెక్టార్) రజనీస్ రాయ్ ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జాతీయ ప్రజాస్వామ్య బోడోలాండ్ ఫ్రంట్ (సోంగ్ బిజిత్) కు చెందిన ఇద్దరు మిలిటెంట్లను కాల్చి చంపారు. వారి దేహాల వద్ద ఆయుధాలను ఆ ఉమ్మడి బృందం ఉంచిందని కూడా ఆయన ఆరోపించారు. అస్సాంలో ఎన్‌కౌంటర్ మరణాలు సంభవించే తీరులోనే రాయ్ ఆరోపణలు ఉన్నాయి. అందుచేత ఆయన లేఖను కొట్టివేయలేము. ఇటువంటి నకిలీ ఎన్‌కౌంటర్‌లలో రకాలు ఉన్నాయి. ఒకటో రకం ఏమిటంటే భద్రతా బలగాలు క్షేత్ర స్థాయిలో గాలింపునకు వెళ్లినప్పుడు వారిపై కాల్పులు జరిగి, వారు ఎదురు కాల్పులకు దిగుతారు. రెండో రకం ఎన్‌కౌంటర్‌లో  చనిపోయేది నిజమైన ఉగ్రవాదే కావచ్చు. కానీ ఆ ఎన్‌కౌంటర్ మాత్రం నిజం కాదు. మూడో రకం నకిలీ ఎన్‌కౌంటర్‌లో ఉత్తి అమాయకుడిని బలిచేస్తారు. సైన్యం లేదా పారామిలిటరీ బలగం విధి ఉగ్రవాదిని పట్టుకోవడం లేదా కాల్చి చంపడం. శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి పాటుపడ్డం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఏరివేతే లక్షం. వారు అది చేయనప్పుడు పై అధికారులనుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఎంత మందిని పట్టుకొన్నారో, ఎన్ని ఆయుధాలు పట్టుబడ్డాయో చూపండని ఆ జవాన్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సందర్భంలోనే ‘బలి పశువు వేట’ తప్పని సరి అవుతుంది.పతకాలు, అవార్డుల కోసం నకిలీ ఎన్‌కౌంటర్లు సాగిస్తారు. ఇతర ప్రయోజనాలు కూడా లేకపోలేదు. సైన్యంలో యూనిట్ ప్రశంసకు మార్కులు ఆధారం. ఉగ్రవాదుల ఏరివేత లేదా పట్టుకొనడం ఆ మార్కులకు మూలం. అలాగే ఉగ్రవాదులు ఎంత మంది లొంగిపోయినట్లు చూపితే అన్ని పాయింట్లు లభిస్తాయి. అలా చూపడం కోసం కొంత మంది కుటుంబాలకు డబ్బు ఇచ్చి ఆ కుటుంబ వ్యక్తిని మూడు నెలల పాటు జైల్లోపెట్టే ఆనవాయితీ కూడా యధేచ్ఛగా సాగుతోంది. డబ్బు ఆశ చూపి జరిపించే నకిలీ ‘లొంగుబాట్లు’ పరిపాటి కావడం గురించి ఇటీవల మీడియా బయటపెట్టింది. అయినా ఈ అక్రమాలు ఆగుతాయన్న భరోసా లేదు.