*జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన
మనతెలంగాణ/పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు పెద్దపల్లి జిల్లాలో నేడు పర్యటించనున్న గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసి నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు. శుక్రవారం జిల్లాలో గవర్నర్ ప ర్యటించే ప్రాంతాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షిం చారు. మంథని మండలం సుందిళ్ల,ధర్మారం మండలం సాయంపేట 6 ప్యాకేజి ప్రాంతాలలో పర్యటించి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చేసేలా సం బ ంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పెద్దపల్లి జిల్లా డిఆర్‌ఒ ప ద్మయ్య,ఆర్‌డిఒ అశోక్ కుమార్,గోదావరిఖని ఎసిపి సిందూశర్మ తదిత రులు ఉన్నారు.
పెద్దపల్లి జిల్లాలో గవర్నర్ పర్యటన వివరాలు
11 గంటలకు అన్నారం సందర్శన
11.20 గంటలకు సుందిళ్ల బ్యారేజి సందర్శన
12 గంటలకు సుందిళ్ల పంప్ హౌజ్ పరిశీలన
12.30 గంటలకు దర్మారం మండలం సాయంపేట
ప్యాకేజి -6 సందర్శన
1.15 గంటల వరకు ప్యాకేజి -6 వద్ద అండర్ గ్రౌండ్ పంప్‌హౌస్,
సర్జ్ ల్,టన్నెల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన.
1.30 గంటలకు కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలో
జరుగుతున్న ప్యాకేజి -బి పనుల పరిశీలన