Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు

ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు

watch

మన తెలంగాణ/ఆసిఫాబాద్:
ప్రపంచ తెలుగు మహాసభలను వైభవంగా చేపట్టాలని కలెక్టర్ చంపాలాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్‌సెక్రటరీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసక్తిగల తెలుగు పండితులు, సాహితీవేత్తలు, కళాకారులు, ప్రజా ప్రతినిధులు, తెలుగు భాషాభిమానులు, మొదలైన వారు వారి పేర్లను సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో బుధవారం సాయం త్రం 5 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 15న జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా నుండి వెళ్లడానికి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ,జైనూర్, కౌటాల మండలాల నుండి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 15న జరిగే ఆరంభ వేడుకల్లో పాల్గొని ఈ నెల 19న ముగింపు వేడుకలకు కూడా పాల్గొనవచ్చన్నారు. బస్సులు ఈనెల 15న ఉదయం 6 గంటలకు బయల్దేరుతాయన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగే ప్రపంచ తెలుగు మహాసభ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉదయం 10 గంటలకు పట్టణంలో పలు వీధుల గుండా ర్యాలీ, మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అన్నిశాఖల అధికారు లు, సాహితీ ప్రియులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, సీపీఓ కృష్ణయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.