Home కరీంనగర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి

Army recruitment rally

 

జాయింట్ కలెక్టర్ జి.వి.శ్యామ్‌ప్రసాద్‌లాల్

కరీంనగర్ : తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించి అక్టోబర్ 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరుగనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జాయింట్ కలెక్టర్ జి.వి.శ్యాంప్రసాద్‌లాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మీ ర్యాలీకి హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 46,734 మంది యువకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతిరోజూ నాలుగువేల మంది చొప్పున వివిధ పోటీలు నిర్వహించబడుతాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

ర్యాలీ ప్రారంభం రోజు అయిన ఈనెల 7వ తేదీన 3448 మంది యువకులకు వివిధ పోటీలు నిర్వహిస్తారని, 7న తెల్లవారుజామున 3.30 గంటల నుంచి బ్యాచ్‌ల వారీగా బ్యాచ్‌కు 250 మంది చొప్పున టెక్నికల్ ట్రేడ్ ఉద్యోగాల కోసం పరుగు పోటీలు నిర్వహిస్తామని ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి పేర్కొన్నారు. 8వ తేదీన టెక్నికల్ ట్రేడ్ కోసం 3430 మంది అభ్యర్థులకు పోటీలు ఉంటాయని తెలిపారు. 9వ తేదీన సోల్జర్ జనరల్ డ్యూటీకి సంబంధించిన ఉద్యోగాల కోసం 4620 మంది అభ్యర్థులకు, 10వ తేదీన సోల్జర్ జనరల్ డ్యూటీకి సంబంధించి 4486 మందికి 13వ తేదీన సోల్జర్ జనరల్ డ్యూటీకి సంబంధించి 4342 మందికి, 14వ తేదీన సోల్జర్ జనరల్ డ్యూటీకి సంబంధించి 4072 మందికి ఇదేరోజున సిపాయి ఫార్మ ఉద్యోగాలకు సంబంధించి 341 మంది యువకులకు పోటీలు నిర్వహిస్తామని ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి పేర్కొన్నారు.

15వ తేదీన సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 2111 మందికి, 16వ తేదీన ట్రేడ్‌మెన్ ఉద్యోగాలకు సంబంధించి 4452 మందికి, 17వ తేదీన ట్రేడ్‌మెన్ ఉద్యోగాలకు సంబంధించి 4344 మందికి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ర్యాలీలో అర్హత సాధించిన వారందరికి తదుపరి సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయంలో రాత పరీక్ష నిర్వహిస్తామని ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి తెలిపారు.

Arrangements for Army recruitment rally complete