Friday, April 19, 2024

గన్‌పౌడర్ సరఫరా చేస్తున్న నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of accused supplying Gunpowder

 

34 బ్యాగుల గన్నీ పౌడర్ స్వాధీనం
రెండు మొబైల్ ఫోన్లు, ఆటో స్వాధీనం
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : డిటోనేటర్ల తయారీకి గన్ పౌండర్ తయారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను నగర సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్,ఫలక్‌నూమా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 34 బ్యాగుల గన్‌పౌండర్, 9బ్యాగుల సోడియం నైట్రేట్ బ్యాగులు, 2 బ్యాగుల సల్ఫర్ బ్యాగులు, ఆటో, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని ఈద్ బజార్‌కు చెందిన ఎండి జైనులాబిన్ షబ్బిర్, షాలిబండకు చెందిన హమీద్ ఖాన్ అలియాస్ నజీర్ అహ్మద్ ఖాన్ కోల్ వ్యాపారం చేస్తున్నాడు. జైనులాబిన్ షబ్బిర్ తండ్రి 1967లో గన్ పౌడర్ తయారీకి లైసెన్స్ తీసుకుని గౌస్ ఆర్మ్ అండ్ అమ్యూనిషన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. తండ్రి మరణం తర్వాత కుమారులు అదే వ్యాపారం చేస్తున్నారు. వీరు సోడియం నైట్రేట్, సల్ఫర్, కోల్ పౌడర్ తయారు చేస్తున్నారు.

సోదరుల మధ్య వివాదం రావడంతో జైనులాబిన్ వేరేగా వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కోల్ పౌడర్ తయారు చేసే నజీర్ అహ్మద్ ఖాన్ అలియాస్ హమీద్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి గన్ పౌడర్ తయారు చేసి కిలోకు రూ.45 చొప్పున విక్రయిస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన సతీష్, విష్ణువర్దన్‌కు ట్రాన్స్‌పోర్టులో పంపిస్తున్నారు. వారు సరుకు అందిన తర్వాత ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తున్నారు. వారు అక్కడ జిలెటిన్ స్టిక్స్ తయారు చేస్తున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఎడిసిపి చక్రవర్తి గుమ్మి పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు శ్రీశైలం, ఎండి తకియుద్దిన్, నరేందర్, చంద్రమోహన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News