Thursday, April 25, 2024

ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న పాత నేరస్థుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of an old criminal for stealing two-wheelers

– సహకరించిన బాలనేరస్థుడు
-రూ.5.50లక్షల సొత్తు స్వాధీనం

మన తెలంగాణ/చాంద్రాయణగుట్ట: నకిలీ మాస్టర్ కీతో ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్న పాత నేరస్థుడితోపాటు ఒక బాల నేరస్థుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సు మారు ఐదున్నర లక్షల రూపాయల విలువ చేసే ఐదు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, ఇన్‌స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మలతో కలిసి దక్షిణ మండల డీసీపీ డాక్టర్ గజారావు భూపాల్ వివరాలను వెల్లడించా రు. యాకుత్‌పురా ఈదిబజార్‌కు చెందిన చికెన్ సెంట ర్లో పనిచేసే ఈసా ఖురేషీ (20) పాత నేరస్థుడు. సైదాబాద్‌లో రెండు, పహాడీషరీఫ్‌లో ఒక కేసులో నిందితుడు గా ఉన్నాడు. పీడీయాక్ట్ నమోదైయ్యింది. పలుమార్లు జై లుకు వెళ్ళొచ్చాడు.

ఒక బాల నేరస్థుడితో కలిసి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, చాదర్‌ఘాట్ పోలీసుస్టేషన్ల పరిధిలో అర్థరాత్రి వేళ సంచరిస్తుంటారు. ఈసా ఖురేషీ ద్విచక్ర వాహనాలను తస్కరించటంతో నిపుణుడు. బాల నేరస్థుడు కొద్ది దూరంలో ఉండి పరిసరాలను గమనిస్తుండగా ఖురేషీ ద్విచక్ర వాహనాలను తన వద్ద గల నకిలీ మాస్టర్ కీతో వాహనాలను ఎత్తుకు పోతుంటారు. మహబూబ్‌నగర్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానస్పాదస్థితిలో ఒక వాహనదారుడు కనిపించాడు. వాహన దృవపత్రాల కోసం ప్ర శ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో అతనిని స్టేషన్‌కు తరలించి విచారించగా పాత నేరస్థుడని తెలిసింది. మరింత లోతుగా విచారించగా మైలార్‌దేవ్‌పల్లిలో రెండు, చాదర్‌ఘాట్‌లో ఒకటి, చాంద్రాయణగుట్టలో ఒకటి, ఇతర ప్రాంతంలో మరో వాహనాన్ని తస్కరించినట్లు తెలిపారు. అదేవిధంగా మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో రెండు సెల్‌ఫోన్లను కాజేశారు. ఈ మేర కు కేసు నమోదు చేసిన పోలీసులు ఇరువురిని రిమాండ్‌కు తరలించారు. అదనపు ఇన్‌స్పెక్టర్ ఎస్.వీరయ్య ఆ ధ్వర్యంలో ఎస్సై గౌస్‌ఖాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కే సు పురోగతిలో ప్రతిభ చూపిన క్రైమ్ సిబ్బంది టి.ప్ర శాంత్, రంగరాజు, వెంకటేష్ గౌడ్, ప్రవీణ్, నిఖిల్‌లను డీసీపీ నగదు పురస్కారంతో అభినందించారు.

అత్యాధునిక సాంకేతికతతో నేరాల అదుపు: డీసీపీ

నేరాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు డీసీపీ గజారావు భూపాల్ వెల్లడించా రు. సాంకేతిక పరిజ్ఞానంతో హాట్ స్పాట్లను గుర్తించి ఆ యా ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయటంతోపాటు నిఘా పెంచనున్నట్లు తెలిపారు. పెట్రోకారు, బ్లూకోల్ట్ సిబ్బందికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానా న్ని, పరికరాలను వినియోగించటంలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచంలోనే నగరం 20వ స్థానంలో, దేశంలో మొదటి స్థా నంలో ఉన్నట్లు వివరించారు. రెండవ స్థానంలో మద్రా స్ ఉన్నట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News