Home తాజా వార్తలు నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్

నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్

Maoist

 

చర్ల : కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని ఆర్ కొత్తగూడెం గ్రామంలో శుక్రవారం ఉదయం నలుగురు మావోయిస్టు పార్టీకి చెందిన మిలీషియా సభ్యులు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఎస్సై రాజువర్మ వెల్లడించారు.ఆర్ కొత్తగూడెం గ్రామం వద్ద స్థానిక పోలీసుల నేతృత్వంలో స్పెషల్‌పార్టీ, సిఆర్పిఎఫ్141బెటాలియాన్ పోలీసులు కలిసి సంయుక్తంగా వాహన తనిఖీలు చేస్తుండగా ఇది గమనించిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా పరుగులు తీశారు. వీరిని గమనించిన పోలీసులు వెంబడించి పట్టుకుని వారివద్ద నుండి తెల్లసంచిని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం వారిని విచారించగా వారు చర్ల మండలానికి చెందిన బోదనేల్లి గ్రామవాసులు మడివి చిట్టిబాబు, మడివి కన్నయ్య, ఇర్ప బాలక్రిష్ణ, మడివి బాలక్రిష్ణ వీరంత గత సంవత్సరకాలం నుండి మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నట్లు తేలిందని ఎస్సై వెల్లడించారు. వీరివద్ద నుండి 800మీటర్ల ఆలివ్‌గ్రీన్ క్లాత్ స్వాధినం చేసుకున్నట్లు తెలిపారు.

Arrest of four Maoist militia members