Thursday, March 28, 2024

వాట్సాప్‌లో వేధిస్తున్న నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Arrest of harassing accused on WhatsApp
బాధితురాలికి న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపిస్తున్న యువకుడు

హైదరాబాద్: మహిళకు అసభ్య మెసేజ్‌లు, వీడియోలు పంపిస్తూ వేధిపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. రంగారెడ్డి జిల్లా, లింగంపల్లికి చెందిన కర్డనూర్ రాజేష్ హౌస్‌కీపింగ్ పనిచేస్తున్నాడు. నిందితుడు తరచూ ఫోన్‌లో యుతులతో ఛాటింగ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. తనకు తెలియని వారికి మెసేజ్‌లు పంపిస్తుంటాడు. ఈ క్రమంలోనే బాధితురాలి మొబైల్ నంబర్‌కు కూడా సెక్స్ ఛాట్ చేసేవాడు. తర్వాత కొద్ది రోజులకు ఫోన్ చేశాడు, అప్పటి నుంచి బాధితురాలి వాట్సాప్ నంబర్‌కు అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. రోజు రోజుకు నిందితుడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ కెవి విజయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News