Friday, March 29, 2024

విరసం కార్యదర్శి ప్రొ.కాశీం అరెస్టు

- Advertisement -
- Advertisement -

Prof Kasim

 

నేడు హాజరుపర్చండి : హైకోర్టు

హైదరాబాద్ : రాష్ట్ర విరసం కార్యదర్శి,అసిస్టెంట్ ప్రొఫెసర్ కా శీం నివాసంలో శనివారం నాడు గజ్వేల్ పోలీసు లు సోదాలు నిర్వహించి అనంతరం అరెస్ట్ చేశా రు. ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ని ప్రొఫెసర్ కాశీం ఇంట్లో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు సోదాలు చేశారు. యూనివర్సిటీలోని ఆయన క్వార్టర్ డో ర్లు పగులగొట్టి పోలీసులు ఇంట్లోకి వెళ్లారు. ఈ నే పథ్యంలో ఆయన ఇంటి దగ్గరకు చేరుకున్న ఒ యు విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో స్వ ల్ప ఉద్రిక్తత ఏర్పడింది. గజ్వేల్ ఎసిపి నారాయణ నేతృత్వంలో కాశీం ఇంట్లో పోలీసులు దాదాపు ఐ దు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, రెండు బ్యాగుల విప్లవ సాహిత్యం, కరపత్రాలను గజ్వేల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ కాశీం ను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం గజ్వేల్‌కు తరలించారు.

ఈ క్రమంలో ప్రొఫెసర్ కాశీం కు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే సో దాలు చేపడుతున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రొఫెసర్ కాశీం పై 2016లో నమోదైన కేసులో భాగంగానే తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ములుగు, సిద్ధిపేట పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నమోదైన కేసులో కాశీం నిందితుడుగా ఉన్నారని. అప్పుడు ఆయన కారులో విప్లవ సాహిత్యం దొరికిన కేసులో పోలీసులు మరోసారి సెర్చ్‌వారెంట్‌తో సోదాలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన కా శీం అరెస్ట్‌పై పౌర హక్కుల సంఘం నేత లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాశీం అరెస్ట్ అక్రమని అతన్ని వెంటనే కోర్టులో హాజరుపర్చాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాశీం అరెస్ట్‌పై అయన భార్య స్నేహలత స్పందించారు. ఐదేళ్ల క్రితం ఓ కేసులో గజ్వేల్ పోలీసులు తనిఖీలు చేశారని.. 2016లో అక్రమంగా బనాయించిన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారన్నారు. తనభర్తపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆమె పోలీసులపై మండిపడ్డారు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వచ్చారని.. హార్డ్ డిస్క్, పుస్తకాలను తీసుకెళ్లారన్నారు. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించామన్నారు .

మావోయిస్టులతో సంబంధాలు
ఇటీవలే విరసం కార్యదర్శిగా ఎన్నికైన ప్రొఫెసర్ కాశీ ంకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన సోదాలలో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, రెండు బ్యాగుల విప్లవ సాహిత్యం, కరపత్రాలను గజ్వేల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలను విద్యార్థులు ఖండించారు. ఒయూలోని కాశీం నివాసం ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ కాసీం భార్య స్నేహాలత మీడియాతో మాట్లాడుతూ నా భర్త ను అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని, 5 సంవత్సరాల క్రితం జరిగిన కేసులో గజ్వేల్ పోలీసులు సోదాలు చేయడం విడ్డూరమన్నారు..2016 లో అక్రమంగా బనాయించిన కేసులో అరెస్ట్ చేశారని, 2016 హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న శ్యామ్ సుందర్ అనే వ్యక్తి దగ్గర దొరికిన పుస్తకాల పై కేసు నమోదు చేశారన్నారు.

నేను తెలంగాణ వాడినే అనే పుస్తకం తో పాటు ఎస్‌సి , ఎస్‌టి వర్గీకరణ పై రాసిన పుస్తకాల పై కేసు నమోదు చేశారన్నారు.. తలపులు గడ్డ పారా తో పగలగొట్టి అక్రమంగా లోపలికి వచ్చారని, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును సెర్చ్ చేశారని, కంప్యూటర్ హార్డిస్క్ లతో పాటు ఇంట్లో ఉన్న పుస్తకాలను తీసుకెళ్లారన్నారు. కాగా కాశీం ఇంట్లో పోలీసుల త నిఖీలను సిపిఐ నేత నారాయణ ఖండించారు. సోదాలు నిర్వహించేందుకు ఖాశీం సాయుధ పోరాటం చేసినవారు కాదన్నారు. కేవలం భావజాలంతో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారని, ఒయు అధ్యాపకుల్లోనూ ఆయన మంచిపేరు సంపాదించుకున్నారన్నారు. రెండు మూడు నెలలుగా పోలీసులు కేసులతో క్షోభకు గురి చేశారని, ఇప్పుడు ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారు అని నారాయణ పేర్కొన్నారు.

నేడు హాజరుపర్చండి : హైకోర్టు
ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ కాశీంను ఆదివారం తమ ముందు హాజరుపర్చాలని హై కోర్టు శనివారం ఆదేశాలిచ్చింది. కాశీంను అన్యాయ ంగా అరెస్ట్ చేశారని, ఆయనను కోర్టులో హాజరుపర్చి ఆ యన స్టేట్‌మెంట్ నమోదు చేసుకోవాలంటూ రాష్ట్ర పౌ రహక్కుల సంఘం ప్రెసిడెంట్ గడ్డం లక్ష్మణ్ వేసిన హె బియస్ కార్పస్‌పిటిషన్‌ను హైకోర్టు అత్యవసరంగా (హౌజ్‌మోషన్ పిటిషన్) విచారణ చేసింది.ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు హాజరుపర్చాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది.

పిటిషనర్ లాయర్ వాదిస్తూ 2016లో పెట్టిన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారని, ఇనాళ్లు కాశీం యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా డ్యూటీ చేస్తున్నారని, అయినా కనపడటం లేదని పోలీసులు చెప్పారని తెలిపారు.చట్ట నిబంధనల మేరకే అంతా జరిగిందని, ఈపాటికి కాశింను సబంధింత కింది కోర్టులో హాజరుపర్చే ఉంటారని ప్రభుత్వ లాయర్ చెప్పారు. హైకోర్టులో పిటిషన్ పడ్దాక స్పందన కాదని, 5 ఏళ్లుగా పోలీసులు ఏం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కేసుల్లో సీబిఐ దర్యాప్తు చేయాలంటే అసలు విషయాలు బయటకు వస్తాయని బెంచ్ వ్యాఖ్యానించింది. విచారణ ఆదివారానికి వాయిదా పడింది.

Arrest of Prof Kasim Secretary of Virasam
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News