Home తాజా వార్తలు గుట్టలో బాలికను కొన్న మహిళల అరెస్టు

గుట్టలో బాలికను కొన్న మహిళల అరెస్టు

Arrested womans who bought a girl in the shell

అమ్ముకోవడం లేదా వ్యభిచారం చేయించడం కోసం బాలిక కొనుగోలు
ఐదేళ్ల క్రితం ఏడాదిన్నర వయసు పాపను యాదగిరిగుట్టలోని బంధువు నుంచి కొన్న చంద్రకళ
4వ తేదీన దగ్గరి బంధువు కవితకు రూ.50 వేలకు విక్రయం 

మన తెలంగాణ/ జగిత్యాల: పడుపువృత్తి కోసం యాదగిరిగుట్ట నుండి ఓ పాపను కొనుగోలు చేసిన ఇద్దరు మహిళలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పాపను శిశు సంరక్ష ణ కేంద్రానికి తరలించారు. కోరుట్ల సిఐ సతీష్ చందర్‌రావు.తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కంసాని చంద్రకళ(30) ఐదు సంవత్సరాల క్రితం యాదగిరి గుట్టలో ఉండే తన కులానికే చెందిన కంసాని శంకర్ వద్ద ఒక్క సంవత్సరం ఆరు నెలల వయస్సున్న పాపను రూ.30 వేలకు కొనుగోలు చేసింది. ఆ పాపను ఎవరికైనా అమ్మటం లేదా వ్యభిచారం చేయించాలనే ఆలోచనలతో చంద్రకళ గత ఐదు సంవత్సరాలుగా పెంచుతోంది. ఇటీవల యాదగిరి గుట్టలో పోలీసులు తనిఖీలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకొని చిన్నారులను కాపాడటంతో తన విషయం పోలీసులకు తెలిస్తే ప్రమాదమని భావించిన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో నివాసం ఉండే తన మేనత్త అయిన ముస్కు కవితకు(36) ఆ పాపను ఈ నెల 4వ తేదిన రూ.50 వేలకు విక్రయించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం పోరుమల్లలోని కవిత ఇంటిని సోదా చేసి పాపతో పాటు ఉన్న చంద్రకళ, కవితలను అదుపులోకి తీసుకున్నారు.