Home Default లాక్‌డౌన్‌లో ప్రజాస్వామ్యం

లాక్‌డౌన్‌లో ప్రజాస్వామ్యం

Arrests in name of corona on civilians in 66 countries

కరోనా మహమ్మారిని ఆసరాగా తీసుకొని ప్రభుత్వ అధికారులు, భద్రతా దళాలు సాధారణ పౌరులపై అసాధారణమైన హింసకు దిగడం, అన్యాయంగా అరెస్టులు సాగించడం పలు దేశాలలో జరిగింది. పలు ప్రభుత్వాలు అసాధారణమైన అధికారాలు పొందడానికి ఈ పరిస్థితిని ఒక అవకాశంగా తీసుకొని, చివరకు న్యాయవ్యవస్థ పనిలో జోక్యంకు కూడా ప్రయత్నం చేస్తూ వచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడం కోసం కరోనాను అనేక ప్రభుత్వాలు ఉపయోగించుకున్నాయి. అప్పటికే అమలు పరుస్తున్న అణచివేత చర్యలను మరింత విస్తృతం కావించడానికి కరోనా ఒక సాకుగా దొరికినదని టర్కీలో ఒక ప్రతిపక్ష నేత తెలిపారు. కరోనా కాలంలో సాధారణ పౌరులపై కనీసం 59 దేశాల్లో పోలీసులు హింసకు దిగారని ఫ్రీడమ్ హౌస్ పరిశోధన వెల్లడి చేసింది. 66 దేశాలలో కరోనా పేరుతో అరెస్టులు జరిపారు.

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను అసాధారణమైన లాక్‌డౌన్‌తో బంద్ బందీ చేసింది. ఈ మహమ్మారి నుండి ఇప్పటిలో బైటపడే పరిస్థితులు కనిపించకపోయినా ప్రజా జీవనం మాత్రం క్రమంగా సాధారణ పరిస్థితుల వైపుకు కదులుతున్నది. అయితే ప్రజాస్వామ్యం మాత్రం లాక్‌డౌన్‌లో బందీగా మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరుతో నిరంకుశ ధోరణులను ప్రదర్శించడం పెరుగుతున్నది. కరోనా మహమ్మారి ఆవహించినప్పటి నుండి సుమారు 80 దేశాలలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిస్థితులు దిగజారుతున్నట్లు అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మేధో వేదిక ఫ్రీడమ్ హౌస్ తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ అసాధారణ పరిస్థితులను ఆసరాగా చేసుకొని పాలకులు అధికార దుర్వినియోగం, ప్రత్యర్థులను మాట్లాడకుండా చేయ డం, కీలకమైన సంస్థలను బలహీనం చేయడంతో పాటుగా ప్రజారోగ్య పరిరక్షణకు అత్యవసరమైన జవాబుదారీతనం వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారని తమ పరిశోధనలో వెల్లడైన్నట్లు ఫ్రీడమ్ హౌస్ తెలిపింది. అంతర్జాతీయ విశ్లేషకుల కూటమితో కలసి 192 దేశాలలో జర్నలిస్టులు, పౌర సమాజ నేతలు, ఇతర నిపుణలతో కలసి కరోనా సమయంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిస్థితులపై జరిపిన సర్వేలో ఈ అభిప్రాయానికి వచ్చారు. అంతర్జాతీయంగా గత 14 ఏళ్లుగా దిగజారుతున్న ప్రజాస్వామ్యం, స్వేచ్ఛల ప్రక్రియకు ఈ మహమ్మారి మరింత ఊతం ఇచ్చిన్నట్లు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను భూస్థాపితం చేయడానికి కరోనాను ఒక అవకాశంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు కంబోడియాలో ఒక నిపుణుడు పేర్కొనడం గమనార్హం.

శ్రీలంకలో సహితం ఇదొక్క చక్కని అవకాశంగా దొరకడంతో గత ఆరు నెలలుగా ప్రధాన మంత్రి మహిందా రాజపక్స ప్రభుత్వం నిరంకుశ ధోరణులను ప్రదర్శించడం ప్రారంభించినట్లు ఈ సందర్భంగా ఫ్రీడమ్ హౌస్ గుర్తు చేసింది. కరోనకు సంబంధించి ప్రభుత్వ ప్రకటనలకు భిన్నంగా ఎవరైనా అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అరెస్ట్ చేయమని ఆదేశించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకంగా మీడియా వాయకుండా కట్టడి చేశారు. సర్వేలో పాల్గొన్న నిపుణులతో 64 శాతం మంది వరకు కరోనా ప్రభావంతో నెలకొన్న తమ దేశంలోని పాలకులలో నిరంకుశ ధోరణులను కట్టడి చేయడం కష్టం కావచ్చని, వచ్చే మూడు నుండి ఐదేళ్ల వరకు కొనసాగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.

గత తొమ్మిది నెలలుగా చైనా అనుభవం భవిష్యత్తులో ఒక తీవ్ర ఆందోళన కలిగించే నమూనాను రుజువు చేస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనంలకు అవకాశం లేకుండా వినూత్న సాంకేతిక నిఘా, దేశంలోని, వెలుపల ఉన్న వ్యక్తులపై అణచివేత కోసం దేశ ప్రజలలో జాతీయవాద ఉన్మాదం వ్యాప్తి చేయడం ద్వారా దేశంలో విమర్శలకు అవకాశమున్న వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో అనేక ప్రజాస్వామ్య దేశాలలో సహితం వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలిపే ప్రయత్నం మీడియా చేయలేక పోయింది. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు జైలు, జరిమానాలకు సహితం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు సిద్ధపడవలసి వచ్చిన్నట్లు క్యూబాలోని ఒక నిపుణుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పౌర సమాజ సంస్థలు సహితం పలు దేశాలలో అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ధోరణులు కుదించుకుపోవడం కనిపిస్తున్నా ప్రజలలో మాత్రం ప్రజాస్వామ్య వాంఛలు పెరుగుతూ ఉండడం సంతోషం కలిగిస్తున్నది.

బెలారస్‌లో ఆగస్టులో ప్రారంభమైన సామూహిక నిరసనలు రాజకీయ సంస్కరణలకు ఒక మహోద్యమంగా మారడం గమనార్హం.
కరోనా మహమ్మారిని ఆసరాగా తీసుకొని ప్రభుత్వ అధికారులు, భద్రతా దళాలు సాధారణ పౌరులపై అసాధారణమైన హింసకు దిగడం, అన్యాయంగా అరెస్టులు సాగించడం పలు దేశాలలో జరిగింది. పలు ప్రభుత్వాలు అసాధారణమైన అధికారాలు పొందడానికి ఈ పరిస్థితిని ఒక అవకాశంగా తీసుకొని, చివరకు న్యాయవ్యవస్థ పనిలో జోక్యంకు కూడా ప్రయత్నం చేస్తూ వచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడం కోసం కరోనాను అనేక ప్రభుత్వాలు ఉపయోగించుకున్నాయి. అప్పటికే అమలు పరుస్తున్న అణచివేత చర్యలను మరింత విస్తృతం కావించడానికి కరోనా ఒక సాకుగా దొరికినదని టర్కీలో ఒక ప్రతిపక్ష నేత తెలిపారు. కరోనా కాలంలో సాధారణ పౌరులపై కనీసం 59 దేశాల్లో పోలీసులు హింసకు దిగారని ఫ్రీడమ్ హౌస్ పరిశోధన వెల్లడి చేసింది.

66 దేశాలలో కరోనా పేరుతో అరెస్టులు జరిపారు. రాజకీయ ఉద్యమకారులను, హక్కుల కార్యకర్తలను, న్యాయవాదులను, జర్నలిస్ట్‌లను, చివరకు డాక్టర్లను మరింతగా అణచడం కోసం, అరెస్టులు జరపడానికి సైనిక ప్రభుత్వం కరోనాను ఒక అవకాశంగా ఉపయోగించుకున్నట్లు ఈజిప్ట్‌లో ఒక నిపుణుడు చెప్పారు. పాక్షికంగా స్వేచ్ఛ గల లైబీరియాలో దారుణమైన కర్ఫ్యూ ఉత్తర్వులను భద్రతా దళాలు అమలు పరచి, తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారు. జింబాబ్వేలో కూడా ప్రతిపక్ష నేతలు, హక్కుల ఉద్యమకారులు, పౌర సమాజ కార్యకర్తలు, జర్నలిస్ట్ లను లాక్‌డౌన్ ఉల్లంఘనల నెపంతో అరెస్ట్, అపహరణ, అత్యాచారం, హింస వంటి దారుణాలకు గురిచేశారు. సోషల్ మీడియాలో తమ విమర్శనాత్మక అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని సహితం పలు దేశాలలో దాడులకు గురిచేశారు. గౌతెమాలాలో ఉన్నత న్యాయ స్థానాలకు న్యాయమూర్తుల ఎంపికలో నేరస్థుల ముఠాలు జోక్యం చేసుకొని ఎన్నికలను రిగ్ చేసే ప్రయత్నం కరోనా సమయంలో చేశారు. సెర్బియాలో న్యాయ వ్యవస్థ పాలక పక్షంలో కుమ్మక్కయి డిఫెన్సె న్యాయవాదులు లేకుండా విడియో లింక్‌లతో విచారణ సాగించారు.

చివరకు పార్లమెంట్‌లను సహితం పలు దేశాలలో ఆరోగ్య ఆంక్షలు, అత్యవసర చట్టాలు పేరుతో చర్చలకు, ప్రతిపక్షాల వాదనలకు అవకాశం లేకుండా కుదించే ప్రయత్నాలు జరిగాయి. భారత పార్లమెంట్‌లో ప్రశ్నల సమయాన్ని రద్దు చేసి, కీలక చట్టాలను సహితం చర్చలు లేకుండా నిమిషాలలో ఆమోదింప చేయడం తెలిసిందే. వైరస్ కట్టడి పేరుతో స్వేచ్ఛను కట్టడి చేసే చట్టాలను ఆమోదించారని సింగపూర్‌లో ఒకరు విచారం వ్యక్తం చేశారు. దాదాపుగా జాతీయ చట్టసభల సమావేశాలను రద్దు చేశారని 39 శాతం దేశాల వారు చెప్పారు. కరోనా సమయంలో పలు దేశాలలో ముఖ్యంగా అణగారిన వర్గాలు అణచివేతకు గురయ్యాయి. పలు దేశాలలో మైనారిటీ మతాలకు, జాతులకు చెందిన వారు లక్ష్యంగా అణచివేత జరిగిన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వాలలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడంతో తామెక్కువగా కరోనా సమయంలో ఇబ్బందులకు గురైనట్లు పలు దేశాలలో ప్రజలు భావిస్తున్నారు. కరోనా పరిస్థితి గురించి తమ ప్రభుత్వాలు అందించిన సమాచారం పట్ల 62 శాతం మంది అవిశ్వాసం వ్యక్తం చేశారు.

సర్వే చేసిన 192 దేశాలలో కనీసం 91 దేశాలలో కరోనా పేరుతో మీడియా తీవ్రమైన ఆంక్షలకు గురైనదని తేలింది. కరోనా గురించి వార్తలు రాస్తున్న జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేసి, పలు దేశాలలో నిర్బంధాలకు, హింసకు, వేధింపులు గురిచేశారు. ‘నకిలీ వార్తలు’ కట్టడి పేరుతో కొత్త చట్టాలు తీసుకువచ్చి ముఖ్యంగా వెబ్‌సైట్, సోషల్ మీడియాలపై తీవ్రమైన నిర్బంధాలను అమలు పరిచారు. అమెరికా, భారత్, బ్రెజిల్ వంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలున్న దేశాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి, ప్రభుత్వ వ్యవహారాలలో పారదర్శకత లోపించడం, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం వంటి సంఘటనలు అనేకం జరిగాయి. మీడియాను అత్యవసర సేవలలో భాగంగా చేయడం ద్వారా దానిని కట్టడి చేసే ప్రయత్నం భారత్‌లో జరిగింది. కరోనాకు సంబంధించి ప్రభుత్వం విధానాలనే వినిపించాలని చివరకు సుప్రీంకోర్టు కూడా సూచించడం గమనార్హం.

Arrests in name of corona on civilians in 66 countries