Home తాజా వార్తలు రేపు ప్రగతి సింగారానికి సిఎం కెసిఆర్

రేపు ప్రగతి సింగారానికి సిఎం కెసిఆర్

CM KCR

 

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి దశదిన కర్మకు హాజరు
కాట్రపల్లి రోడ్డులో హెలీప్యాడ్ ఏర్పాటు
భారీ బందోబస్తు ఏర్పాటులో అధికార యంత్రాంగం

వరంగల్ రూరల్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 14న వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి రానున్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్వగ్రామం ప్రగతి సింగారం. ఎమ్మెల్యే ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతు ఈనెల 4న మృతిచెందారు. స్వగ్రామమైన ప్రగతి సింగారంలో మల్లారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం మల్లారెడ్డి దశదిన కర్మలు నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిసి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రగతి సింగారం గ్రామానికి రానున్నారు.

Arrival of CM KCR to Pragati Singaram tomorrow