Home తాజా వార్తలు సరైన తోడు కోసం

సరైన తోడు కోసం

 

perfect life partner

 

జీవితాంతం కలిసిమెలిసి కాపురం చేయవలసిన భర్త ఎలా ఉంటే బావుంటుంది? అతనిలో ఎలాంటి గుణగణాలు ఉండాలి? చక్కగా ఉంటే చాలా? చక్కగా వినాలా? ప్రేమలో విశ్వనీయత ఉందో లేదో ఎలా తేల్చుకోవాలి? కాపురంపైన అతను ఎలాంటి ఎఫెక్ట్ పెట్టగలడు? వృత్తిగత, వ్యక్తిగత జీవితాన్ని సమతౌల్యం చేసుకోగలడా? ఇవన్నీ అమ్మాయిల మనసులో పెళ్లి గురించి సాగే ఆలోచనలు.

ఒక మనస్తత్వ విశ్లేషణ ఏం చెబుతుందంటే సాధారణంగా ఆడవాళ్లు మగవాళ్ల నుంచి ఏం కోరుకుంటారంటే ..వారి స్వభావం, రూపం, గుణం మాట ఎలా ఉన్నా తమ మాటలు చురుగ్గా వింటూ ఉండాలని, వెంటనే తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలనుకుంటారట. తమకు సామాజిక ఆర్థికభద్రత ఇవ్వగల వాడిని ఇష్టపడతారు. భర్తలో చాలా కేరింగ్‌గా ఉండే తండ్రి, తమ పట్ల శ్రద్ధ, ఇష్టం చూపించే స్నేహితుడు, భద్రత ఇచ్చే వ్యక్తిని చూస్తారట. ఇదేం ఒక్కరోజులో ఒకళ్లు ఇద్దరితో చేసిన సర్వే రిపోర్టు కాదు. ప్రపంచవ్యాప్తంగా జాతిమత విచక్షణ లేకుండా అన్ని ప్రాంతాలను, దేశాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఒక పరిశోధన ఫలితం.

అసలు పర్‌ఫెక్ట్ అంటే ఏమిటి? ఇవ్వాల్టి అమ్మాయిలు చక్కగా చదువుకొంటున్నారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. తమ కంటే పై తరం స్త్రీల జీవితాలను అర్థం చేసుకున్నారు. అందుకే కాబోయే భర్త తమ స్వాతంత్రానికి విలువ ఇచ్చే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారు. మంచి శ్రోతగా, భార్య పట్ల కుటుంబం పట్ల ప్రేమ విలువతో చూపెట్టాలనుకుంటారు. వ్యక్తిగత, వృత్తిపర, సామాజిక ఒత్తిడిని ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదురైనపుడు తనకు సపోర్టు ఇచ్చేవాడిగా ఉండాలనుకుంటారు. భర్త ఇంత సపోర్టుగా ఉంటే మిగతా విషయాల్లో ఎంతయినా సర్దుకు పోవచ్చు అనుకుంటారు. ఒకవేగవంత జీవనశైలిలో భార్య భర్త ప్రయాణం చేస్తున్న సమయంలో ఇలా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లేకపోతే వివాహ జీవితపు మనుగడ కష్టం. మనుషుల్లో వినటం అనేది కళ. చాలా మందికి వినే సహనం ఉండవు. భార్యాభర్తల మధ్య ఈ సహనం లేకపోతే ఎంతో కష్టం. ఒక సమస్య విషయంలో అయినా, నిత్యజీవితం అయినా ఎదుటి మనిషి చెప్పే మాటలు వినే సహనం ఉండాలి.

ఇవన్నీ సహజం: కుటుంబంలో చిన్న చిన్న పోట్లాటలూ, వాగ్విదాలు, మనస్పర్థలూ వస్తాయి. కానీ భార్యాభర్తలు ఎవరికి వారే తాము కరెక్ట్ అన్న అభిప్రాయంతో ఉంటే మటుకు చాలా నష్టం. ఎదుటివాళ్లను అవమానించి తీరాల్సిందే అనో, మన వాదన నెగ్గాలనో, పట్టుదల వల్లో ఇంకో కొత్త సమస్యకు దారి తీస్తాయి. అర్థం లేని పట్టుదలతో కుటుంబ జీవితాన్ని తారుమారు చేస్తాయి. భార్యాభర్తల మధ్య పట్టువిడుపులు ఉంటేనే మంచిది. ఇద్దరూ తీరికలేని ఉద్యోగాల్లో ఉండవలసి వస్తే, ఎన్నో డిన్నర్ ప్లాన్లు, కుటుంబ ఫంక్షన్లు, చిన్న పాటి వేడుకలు కూడా మిస్ అవ్వాల్సి ఉంటుంది. ముందే ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. పిల్లలను కనాలనుకున్నా, కన్నవాళ్ల పెంపకం విషయంలో ముందే ఒక అండర్ స్టాండింగ్‌కు రావాలి. ఇద్దరూ ఎంతో ఫ్లెర్టిబుల్‌గా ఉంటేనే సమస్యలు రాకుండా ఉంటాయి.

ప్రేమ ప్రదర్శన: చాలా మంది స్త్రీ పురుషులకు భావ వ్యక్తీకరణ సామర్ధం ఉండదు. మనసులో ప్రేమని, ఇష్టాన్ని, భయాన్ని, కోపాన్ని, అపరాధభావాన్ని దేన్నీపైకి సరిగ్గా చెప్పలేకపోతారు. అలాగే పిల్లలను చేరదీయటం కూడా మాటలతో చెపితేనే అవతలవాళ్లకూ చేరుతుంది. అలా మాట్లాడే చాకచక్యం లేకపోతే బాంధవ్యంలో బీటలు పడతాయి. దీన్ని పెళ్లికి ముందే ఒకళ్లనొకళ్లు అర్థం చేసుకునే క్రమంలోనే తెలుసుకోవాలి. లేదా పెళ్లయిన తర్వాత చాలా కొద్ది రోజుల సాహిత్యంతో ఒకళ్లనొకళ్లు అర్థం చేసుకునే క్రమంలో తెలిసిపోతుంది. బాంధవ్యంలో ఈ అర్థం చేసుకోవటం అన్నది చాలా ముఖ్యం. అవతల మనిషి నిజంగా సహృదయులేనా? మంచితనం ఉందా? కేవలం దాన్ని ప్రకటించటంలోనే ఫెయిల్ అవుతున్నదా అని తెలుసుకుంటే ఈ సమస్య అస్సలు రానేరాదు. దాంపత్య జీవితానికి మొదటి సక్సెస్ మంత్రం, ఈ పరస్పరం అర్థం చేసుకోవటం మాత్రమే.
ఆడపిల్లలు భర్తను ఎంచుకునే క్రమంలో ఒకే ఒక్క విషయం గీటురాయిగా తీసుకోవాలని విజ్ఞులు చెబుతారు.

తమ జీవితంలోకి రాబోయే మనిషి జీవితానికి ఒక లక్షం అంటూ ఉంటుందా? వృత్తి ఏదైనా ఒక లక్షం తో జీవితం గడిపే మనిషి అన్ని విషయాల్లో కూడా లక్షం ప్రధానంగానే ఉంటుంది. జీవితంలో సుఖంగా, సంతోషంగా శాంతిగా ఉండాలనే లక్షం ఉందో లేదో తేల్చుకోవాలి. వృత్తిగత జీవితానికి, వ్యక్తిగత జీవితానికి సమాన ప్రాధాన్యం ఇస్తారా లేదా? కుటుంబం పట్ల బా ధ్యతతో ఉంటారా లేదా మాటల్లో తెలుసుకునే విషయా ల్లో ఏ విషయంలోనైనా బాధ్యతగా ఫీలయ్యే మనిషికి అన్ని విషయాల్లో బాధ్యతగా ఉండటం తెలుస్తుంది. కుటుంబం గొప్ప బాధ్యత. ప్రేమ ఒక బాధ్యత. పిల్లలు వాళ్ల భవిష్యత్తు ఒక బాధ్య త. మంచి పౌరుడుగా ఉండటమూ బాధ్యతే. మంచి భర్తగా, తండ్రిగా, తాతగా, స్నేహితుడిగా, ప్రేమికుడుగా ఏ బంధుత్వంలో అయినా బాధ్యత ఫీలయితే ఇక బాంధవ్యానికి తిరుగులేదు.

                                                                                       – చేబ్రోలు శ్యామ్ సుందర్

Article about Marriage life and perfect life partner