Home ఆఫ్ బీట్ కుండ మట్టిదే గానీ..

కుండ మట్టిదే గానీ..

మట్టి కుండకానీకి ఎంతకష్టపడాలె!

కుమ్మరవాడి నుంచి పగలకుండా ఇంత దూరం తేవాలంటే చిన్న పనా?  పది తెస్తే రెండు పగలతయ్యి. గంత చేసినా ఏం లాభం? మట్టికుండ అంటే లోకువ. అదే ప్లాస్టిక్ బొచ్చెలు మూడొందలన్నా దాని మీదుండే పూలు, రంగులు చూసి ముచ్చటపోతారు. మంచి నీళ్లు తాగనీకి మట్టి కుండ కావాలె, అగ్గవకు రావాలె. 

matti-kunda

అది హైదరాబాద్‌లో ఎర్రగడ్డ ఏరియా. సనత్ నగర్ టర్నింగ్‌లో ఫుట్‌పాత్ మీదనే ఉన్నాయి ఎర్రటి కుండలు.
అమ్మా! ఈ కుండ ఎంత?
రెండొందలు బిడ్డా!
మట్టి కుండా… బంగారం కుండా… కొనడానికి వచ్చినామె మాటల్లో విరుపు.
కుండ మట్టిదే కానీ బిడ్డా, మట్టి కుండ కానీకి ఎంత కష్టపడాలె. మా పొట్ట గడవాలె కద… పక్కనే ఉన్న మగాయన సర్ది చెప్పబోయాడు. వెంటనే అతడి భార్య కుమ్మరవాడి నుంచి పగలకుండా ఇంత దూరం తేవాలంటే చిన్న పనా? పది తెస్తే రెండు పగలతయ్యి. గంత చేసినా ఏం లాభం? మట్టికుండ అంటే లోకువ. అదే ప్లాస్టిక్ బొచ్చలు మూడొందలన్నా దాని మీదుండే పూలు, రంగులు చూసి ముచ్చటపోతారు. మంచి నీళ్లు తాగనీకి మట్టి కుండ కావాలె, అగ్గవకు రావాలె. కుండలమ్మే ఆవిడ మాటల్లోనూ విసుగు.

మా అమ్మ, నాయనమ్మవాళ్లు అన్నం వండినా ఈ కుండల్లోనే, కూరలొండినా వీటిలోనే. అటికలో పప్పు ఉడికించి పప్పు గుత్తితో మెత్తగా రుద్దేటోళ్లు. వాళ్లు పప్పు రుద్దితే పప్పు మెదిగేదే తప్ప అటిక పగిలేది కాదు. అంత చాకచక్యంగా పనులు చేశారు వాళ్లు. మాట అంటున్నానని కాదు కానీ, ఇప్పటి పిల్లల చేతికి పులుసు అటికె ఇస్తే, దానిని టేబుల్ మీద ఠపీ మని పెట్టి పగలగొడతారు. కుండల్లో వండినపుడు అంత జాగ్రత్తగా పని చేయాలి. అప్పట్లో అది అవసరం కాబట్టి అంత జాగ్రత్తగా చేశారు. ఇప్పుడు అన్నీ గట్టి స్టీలు పాత్రలు వచ్చేశాయి. వాటిని ఎలా పడేసినా ఏమీ కావు. అలా పెరిగిన పిల్లలకు కుండను పట్టుకోవడం అలవడదు.

ఆటో విజయనగర్ కాలనీ లో నుంచి ఆసిఫ్‌నగర్‌లోకి ఎంటరైంది. మరికొంత లోపలికి పోతే వీథుల్లో రెండు వైపులా కుండలు దొంతరలు పేర్చి ఉన్నాయి. అదే కుమ్మర వాడి. కుండలు చేసే వాళ్లు నివసించే ప్రదేశం. పెద్ద వాహనం ఆ వీథుల్లో ప్రయాణించాలంటే కష్టమే. ఏ వైపు కుండలకు తగిలినా ఆ శ్రమజీవుల కష్టం పగిలి పెంకులవుతుంది. మంచి నీటి కుండలకు కుళాయిలు అమర్చి ఉన్నాయి. కాలంతో పాటు అప్‌డేట్ కావడం అంటే ఇదేనేమో! ఓ కుండల దొంతర దగ్గర భార్యాభర్తలు నిలబడి మాట్లాడు కుంటున్నారు. పలకరించే లోపే మాట కలిపాడు. ఆయన పేరు దర్గా ఈశ్వరయ్య, ఆయన భార్య మల్లమ్మ. ఆయన మాటల్లో కుండల మీద ప్రేమ వ్యక్తమవుతోంది, అంతకంటే ఎక్కువగా వృత్తి మీద గౌరవం కనిపిస్తోంది. ఆయనకు డ్బ్బై రెండేళ్లు. ఈ తరానికి మట్టిపాత్రల పేర్లు కూడా సరిగ్గా తెలియదని ఆయనకు గొప్ప నమ్మకంలా ఉంది. పిల్లలకు నేర్పించినట్లు ఇది ప్రమిద అంటూ మొదలు పెట్టి ఒక్కొక్కటి చూపించి వాటి పేర్లు చెప్పసాగాడు.
హుండీ (గల్లా), సురయి, జామ్, బిందె (పెద్ద జామ్), చిప్ప, తందూర్, మూకుడు, ముంత… ఇంకా ఊదుదాన్, గోలు కుండ, ఐరేని కుండలు కూడా చేస్తాం. గోలు కుండ ఇప్పుడు ఎవరూ వాడడం లేదు. ఐరేని కుండలను పెళ్లిళ్లలో, బోనాలకు వాడతారు. గోళెంలో ధాన్యం నిల్వ చేస్తారు. ఇదిగో ఈ పెద్దది తందూర్. దీని చుట్టూ మంట పెడతారు. చపాతీ రొట్టెల పిండిని తందూర్ లోపల అద్దుతారు. బయట మంట వేడికి లోపల పిండి కాలి రొట్టె అవుతుంది. అదే తందూర్ రోటీ.
ఈ నల్ల మూకుడు పెరుగు తోడు పెట్టుకోవడానికి, గివన్నీ ఇప్పుడు ఇళ్లలో ఎవరూ వాడడం లేదు. పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల వాళ్లు కొంటున్నారు. ఎత్తు తక్కువగా వెడల్పుగా ఉంది… ఇది అటిక. కూరలు వండుకుంటారు. మా నాయిన తరంలో అందరూ వీటిలోనే వండుకునేటోళ్లు. ఇప్పుడు చేపల పులుసు కోసం కొంటున్నారు. అది కారులో పోతూ కంటికి కనిపిస్తే కొనుక్కోవాల్సిందే తప్ప, అటిక కోసం మా కుమ్మరవాడి వెతుక్కుంటూ వచ్చే తీరిక ఎవరికుంటుంది? డబ్బున్నో ళ్లు పెరుగు కోసం ఈ పాత్రలు అడుగుతారు. సరదా పడి కొ నుక్కుపోయినా వాటిని జాగ్రత్తగా కడగడం ఈ తరం లో ఎవరికి వచ్చు గనుక. నాలుగురోజుల్లో పగల గొట్టుకుంటారు.
అన్నానికీ సున్నానికీ ఇవే!
మా అమ్మ, నాయనమ్మ వాళ్లు అన్నం వండినా ఈ కుండల్లోనే, కూరలొండినా వీటిలోనే. అటికలో పప్పు ఉడికించి పప్పు గుత్తితో మెత్తగా రుద్దేటోళ్లు. వాళ్లు పప్పు రుద్దితే పప్పు మెదిగేదే తప్ప అటిక పగిలేది కాదు. అంత చాకచక్యంగా పనులు చేశారు వాళ్లు. మాట అంటున్నానని కాదు కానీ, ఇప్పటి పిల్లల చేతికి పులుసు అటికె ఇస్తే, దానిని టేబుల్ మీద ఠపీ మని పెట్టి పగలగొడతారు. కుండల్లో వండినపుడు అంత జాగ్రత్తగా పని చేయాలి. అప్పట్లో అది అవసరం కాబట్టి అంత జాగ్రత్తగా చేశారు. ఇప్పుడు అన్నీ గట్టి స్టీలు పాత్రలు వచ్చేశాయి. వాటిని ఎలా పడేసినా ఏమీ కావు. అలా పెరిగిన పిల్లలకు కుండను పట్టుకోవడం అలవడదు. అప్పట్లో అందరికీ తమలపాకు పాన్ అలవాటుండేది. ప్రతి ఇంట్లో సున్నం పిడత (చిన్న పాత్ర) తప్పనిసరి. మంచినీటి కుండ బాగున్నా సరే ఎండకాలం వస్తే కొత్త కుండ కోసం చూసేవాళ్లు. గంజికుండ, జల్లి మూకుడు (అన్నం వండి గంజి వార్చుకునే చిల్లుల మూకుడు), వేరుశనక్కాయలు వేయించుకునే మం గలం ఉండేది. నీళ్లు నిల్వ చేయడానికి పెద్ద బానలుండేవి. చెట్ల కుండీలు మట్టివే ఉండేవి ఇప్పుడవీ ప్లాస్టిక్‌లో వచ్చాయి. ఇళ్లలో పూలను అందంగా అలంకరించుకోవడానికి గురిగెలుండేవి. ఫ్లవర్ వాజ్లన్నమాట. దీపాల పండక్కి ప్రమిదలు మస్తు అమ్ముడవుతాయి. కార్తీకమాసంలో శివుడి గుళ్లలో దీపాలు పెడతారు.

మట్టిని ఐదు రోజులు నానబెట్టాలి. రోజూ కొద్ది సేపు మట్టిని తొక్కి, మధ్యలో గుంట చేసి నీటితో నింపుతూ ఉండాలి ఐదు రోజుల పాటు. ఐదో రోజుకు పెళ్లలు లేకుండా మెత్తని మన్ను అవుతుంది. ఇంట్లో చిన్న పిల్లలకు కూడా మట్టి తొక్కడం అలవాటు చేస్తారు. సారె మీద పని నేర్పించేటప్పుడు మొదట ప్రమిద చేయిస్తారు. ప్రమిదను తీరుగా (వంకలు పోకుండా చక్కటి వలయాకారం వచ్చేటట్లు) చేయడం వచ్చాక మిగిలినవి నేర్పిస్తారు. సారె నుంచి పాత్రను తీయడమే ఇందులో అసలు విద్య. నైపుణ్యంగా చేయకపోతే ఆకారం పోయి మట్టి ముద్దయి పోతుంది. అందుకే ప్రమిద నేర్చుకునేటప్పుడే సూదితో కోయడం కూడా నేర్పిస్తారు. మహారాష్ట్ర వంటి కొన్ని చోట్ల సారె మీద నుంచి పాత్రను తీయడానికి దారంతో కోస్తారు. హైదరాబాద్, తెలంగాణలో సూదితో కోస్తారు. సారె నుంచి తీసిన తర్వాత ఆరబెట్టి బట్టీలో కాలుస్తారు.
ఏ కుండ అయినా మట్టి ఒక్కటే! ఎర్ర కుండ అయినా నల్ల కుండ అయినా మట్టి ఒక్కటే. నల్ల కుండ చేయాలంటే ఎక్కువ మంది పని చేయాలి, కాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ధర కూడా ఎక్కువగా పెట్టాలె. ఎర్ర కుండకి పని తగ్గుతుంది. చూడడానికి కూడా ఎర్ర కుండ బాగుంటుంది. ఇళ్లలో నల్లకుండ చూడనీకి బాగుండదని ఎర్ర కుండ కొంటున్నారు. అందుకే మేమూ ఎర్రకుండలే చేస్తున్నాం.

మట్టి కోసం దేవులాట
మా నాయిన, తాత కుండలు చేసినారు, వాళ్లు మట్టికి తిప్పలు పడనేలేదు. మసాబ్‌ట్యాంకులో మస్తు దొరికేది. చెరువులు, కుంటలు కూడా మస్తుండేటివి అప్పుడు. ఇప్పుడు అన్నీ పూడికపెట్టి బిల్డింగులు లేపినారు. ఇప్పుడు మట్టి కోసం శంషాబాద్ దాటి ఆమన్‌గల్ కెల్లి కొని తెచ్చుకుంటున్నాం. అప్పుడు మా నాయిన బండి కట్టుకుపోయి మట్టి గంపల్తో పోసుకుని వచ్చేటోడు.ఇప్పుడు డబ్బెట్టి కొనాలె. లారీ మట్టి పదివేలు. కట్టెలు కూడా చేతికష్టంతోనే వచ్చేవి. హైటెక్ సిటీ, పెద్దమ్మగుడి చుట్టూ చెట్లే. కొమ్మలు నరికి తెచ్చుకునేటోళ్లు మా పెద్దోళ్లు. ఇప్పుడు మేము కట్టెలు కూడా అడితి నుంచి మోపులు లెక్కన కొంటున్నాం. క్వింటాల్ కట్టె 800 రూపాయలు. అప్పట్లో ముడిసరుకు కు డబ్బు పెట్టే పనే ఉండేది కాదు, మా శ్రమకే వెలకట్టే వాళ్లం. కుండ రూపాయికి అమ్మినా మా పొట్ట సుఖంగా గడిచిపోయేది. ఇప్పుడు కుండ 130 రూపాయలకు అమ్మితే తప్ప గిట్టదు. నూట ముప్పయి రూపాయల కుండలో మాకు మిగిలేది 30 రూపాయలే.
మన్ను కుండ కావాలంటే!
మట్టిని ఐదు రోజులు నానబెట్టాలి. రోజూ కొద్ది సేపు మట్టిని తొక్కి, మధ్యలో గుంట చేసి నీటితో నింపుతూ ఉండాలి ఐదు రోజుల పాటు. ఐదో రోజుకు పెళ్లలు లేకుండా మెత్తని మన్ను అవుతుంది. ఇంట్లో చిన్న పిల్లలకు కూడా మట్టి తొక్కడం అలవాటు చేస్తారు. సారె మీద పని నేర్పించేటప్పుడు మొదట ప్రమిద చేయిస్తారు. ప్రమిదను తీరుగా (వంకలు పోకుండాచక్కటి వలయాకారం వచ్చేటట్లు) చేయడం వచ్చాక మిగిలినవి నేర్పిస్తారు. సారె నుంచి పాత్రను తీయడమే ఇందులో అసలు విద్య. నైపుణ్యంగా చేయకపోతే ఆకా రం పోయి మట్టి ముద్దయిపోతుంది. అందుకే ప్రమిద నేర్చుకునేటప్పుడే సూదితో కోయడం కూడా నేర్పిస్తారు. మహారాష్ట్ర వం టి కొన్నిచోట్ల సారె మీద నుంచి పాత్రను తీయడానికి దారం తో కోస్తారు. హైదరాబాద్, తెలంగాణలో సూదితో కోస్తారు. సారె నుంచి తీసిన తర్వాత ఆరబెట్టి బట్టీలో కాలుస్తారు.
ఏ కుండ అయినా మట్టి ఒక్కటే!
ఎర్ర కుండ అయినా నల్ల కుండ అయినా మట్టి ఒక్కటే. నల్ల కుండ చేయాలంటే ఎక్కువ మంది పని చేయాలి, కాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ధర కూడా ఎక్కువగా పెట్టాలె. ఎర్ర కుండకి పని తగ్గుతుంది. చూడడానికి కూడా ఎర్ర కుండ బాగుంటుంది. ఇళ్లలో నల్లకుండ చూడనీకి బాగుండదని ఎర్ర కుండ కొంటున్నారు. అందుకే మేమూ ఎర్రకుండలే చేస్తున్నాం.
నాకు పదిహేనేళ్లు వచ్చినప్పటి నుంచి సారె మీద పని చేయడం నేర్పించినాడు మా నాయిన. 15రోజులకే చెయ్యి తిరుగుతుంది. పదేళ్లు ఆయన చేతికిందే పని చేశాను. మట్టితో అన్ని రకాల పాత్రలూ చేయగలను. మా పిల్లలకు కూడా నేర్పించాను. కానీ మట్టిదే పెద్ద కష్టం. అందుకే పని బంద్ అవుతుంది. నేను చేయనీకే చేతినిండా పని లేదిప్పుడు. ఇంట్లో ఉన్న అన్ని చేతులకూ పని ఉంటేనే కదా అందరం ఇదే పని మీదుండేది. పిల్లలు తలా ఒక కొలువు చేసుకుంటున్నారు. పొద్దున ఓ గంట ఈ కుండల పని చేసి డ్యూటీకి పోతారు. మిగిలిన పనులు ఇంట్లో ఆడవాళ్లు చూస్తారు.
మా కుమ్మరవాడిలో కుండలు చేసి మొజాంజాహీ మార్కెట్ల అమ్ముకునేటోళ్లం. మా తాతల నాటి నుంచి మా దుకాణాలక్కడే. ఇప్పుడు వాటన్నింటినీ తీసేయమంటున్నారు. ఇప్పటి వరకైతే కులవృత్తిని పోనీయకుండా పట్టుకచ్చిన. కుండలు చేయడమే యజ్ఞం చేసినంత పనవుతుంటే… వాటిని అమ్మనీకి జాగాలేకుండా లాక్కుంటే అప్పుడేం చేయాలె? కుండలు చేయడం పూర్తిగా బంద్ పెట్టుడే.

మంజీర