Home జయశంకర్ భూపాలపల్లి తరలివచ్చిన సారలమ్మ

తరలివచ్చిన సారలమ్మ

mdrm

కన్నెపల్లి నుంచి కన్నుల పండువగా వనదేవత రాక 

దారి పొడవునా సాగిలబడి మొక్కులు
తొలిరోజు సారలమ్మతో పాటు గద్దెలపైకి వచ్చిన
పగిడిద్దరాజు, గోవిందరాజులు
నేడు గద్దెపైకి సమ్మక్క రాక

మేడారం : కన్నెపల్లి వెన్నల సారలమ్మ గద్దెలపై కొలువు దీరింది. బుధవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలను ఆదివాసీ సంప్రదాయాల తో నిర్వహించారు. సారలమ్మ పూజారి కాక సారయ్య, కాక లక్ష్మీబాయి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆడ బిడ్డను పుట్టింటికి పంపించడానికి ఊరు ఊరంతా శుద్ధి చేశారు. ఇళ్ల ముందర అందంగా అలుకులు వేసుకొని ముగ్గు లు వేసుకున్నారు. గుడిలో పూజా తంతు నిర్వహిస్తుండగా కన్నెపల్లి గూడెం మొత్తం అక్కడికి చేరుకున్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సంతానం లేనివారు, వివాహాలు కానివారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తడిబట్ట స్నానాలు చేసి ఆలయం ముందు వరంపట్టారు. గుడి నుంచి తల్లి బయటకు వస్తుండగా దారి పొడవునా అడ్డం గా పడుకున్నారు. సారలమ్మ కాలిధూళి తాకినా త మ కష్టాలు తీరుతాయనే ప్రగాఢ నమ్మకం, విశ్వాసంతో భక్తులు తల్లికి ఎదురువెళ్లి అడ్డంగా పడుకోవడంతో వారిని తొక్కుకుంటూ ముందుకుసాగిం ది. తమ ఇంటి ఆడబిడ్డను తల్లి చెంతకు తరలిస్తుం గా కన్నెపల్లి గ్రామం పొడువునా ఇంటింటికి స్వా గతం పలుగుతూ దీపాలతో హారతులు పడుతూ, నీళ్లు ఆరబోస్తూ మేడారం గ్రామానికి సాగనంపా రు. కన్నెపల్లి గ్రామం నుంచి దారి పొడవునా జయజయ ధ్వానాలతో జైసారక్క.. జైజై సారక్క తల్లి అంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకు సా గారు. తల్లి సారమ్మ మమ్ములను సల్లంగచూడమ్మ అంటూ మేడారంలోని తల్లిచెంతకు పంపించారు. దారి పొడవునా భక్తులకు దీవెనెలు ఇస్తూ మార్గ మధ్యలో ఉన్న తమ్ముడు జంపన్నను ముద్దాడు తూ కుశల ప్రశ్నలు వేసింది. అక్క తమ్ముల పలుకరింపు అందరినిక మంత్ర ముగ్ధులను చేసింది. సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కన్నెపల్లి నుం చి బయలు దేరిన సారలమ్మ అర్ధరాత్రి మేడారంలోని గద్దెలపైకి చేరుకుంది. గతంలో ప్రతిసారి సాయంత్రం ఐదున్నర, ఆరుగంటలకే కన్నెపల్లి గ్రామం నుంచి బయలుదేరి వచ్చే సారలమ్మ ఈసారి ఆలస్యంగా బయలుదేరింది. అధికారులు, ప్రజాప్రతినిధుల పూజారులతో కొంత నిర్లక్షంగా వ్యవహరించడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. సారలమ్మ గద్దెపైకి చేరుకునే సమాయానికే కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెపైకి తీసుకొచ్చారు. అదేవిధం గా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రా మం నుంచి గోవిందరాజును గద్దెపైకి తీసుకొచ్చా రు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు.
నేడు సమ్మక్క ఆగమనం..
మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతర ప్రధాన ఘట్టం మరికొద్ది గంటలలో ఆవిష్కృతం కాబోతున్నది. గురువారం మా ఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ దివాసీ పూజారులు గిరిజన సంప్రదాయాలతో త ల్లిని తీసుకరాకబోతున్నారు. మేడారం గ్రామానికి తూర్పు దిక్కున ఉన్న చిలకలగుట్టపైన ఉన్న నమిలినార చెట్టు వద్ద తల్లికి పూజారులు ప్రత్యేక పూజ లు నిర్వహిస్తారు. ప్రధాన వడ్డేలు కొక్కెర కృష్ణ య్య, సిద్ధబోయిన మునీందర్‌లు గుట్టపై నుంచి తీసుకొస్తుండగా మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్, జి ల్లా కలెక్టర్, ఎస్‌పిలు అధికార లాంఛనాలతో తల్లి ని తోడ్కొని గద్దెలపై వస్తారు. తల్లి రాకను తెలియజేస్తూ జిల్లా ఎస్‌పి గాల్లోకి కాల్పులు జరుపుతారు.