Home మన ఆరోగ్యం క్షయ పీడుతులపై చిన్నచూపు..

క్షయ పీడుతులపై చిన్నచూపు..

tuber

2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్న సంకల్పంతో కొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించా లన్న ఆశయంతో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టుకున్న లక్షం కన్నా అయిదు రేట్లు ముందుగానే ఈ లక్షాన్ని నేరవేర్చాలన్నా పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే క్షయ రోగులలకు వైద్య చికిత్స పూర్తిగా అందించేందుకు కావలసిన మౌలిక సౌకార్యాలు ప్రస్తుతం లోపించాయి. క్షయ బాగా ముదిరిన రోగులు కుటుంబాలు చాలా ఉదాసీనతకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని తట్టుకోలేక ఆఖరిదశలో ఉన్న క్షయరోగులు అన్యత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ దశలో మల్టి డ్రగ్ రెసిస్టెంట్ (ఎండిఆర్) డ్రగ్ రెసిస్టెంట్ (ఎక్యడిఆర్) స్థాయిలో ఉన్న రోగులు అంటే ఎలాంటి మందులకు చికిత్సలో లొంగని దుర్భర పరిస్థితిని ఎదుర్కోంటున్న క్షయరోగులకు అయ్యే భద్రత కల్పిచడం అన్యత్రులను వీడని సమస్యగా వెంటాడుతుంది. దేశంలో ఖాలీ అస్పత్రుల్లో పెద్దదైన ఖాతా ఆస్సత్రి హైదరాబాద్‌లో ఉన్నప్పటికి చరమాంకంలో ఉన్న క్షయ రోగులకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఏదీ లేకపోవడం గమనార్హం వీరికి ఆర్థిక పరంగా పోషకాహార సౌకారాల పరంగా తగిన సహకారం లేదంటే కేంద్ర ప్రభుత్వం వక్తం అవుతుంది. ఈ రోగుల ఆరోగ్య భద్రత విషయంలో అత్యంత శ్రద్ధ అవసరం అదే విధంగా వ్యాధిని నియంత్రించే సమగ్ర యంత్రాంగం కూడా అవసరం . దురదృష్టవశాత్తు ఇలాంటి వేవి హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కడా కనిపంచడం లేదు. క్షయరోగులు నివారించలేని రోగ కారక బ్యాక్టీరియా ప్రభావంతో కుమిలి పోతున్నారు. భారత్ తో పాటు స్వల్ప మధ్యతరగతి ఆదాయాలు గల దేశాల్లో ఎక్కువ మంది నయం చేయలేని “ఎక్సడిఆర్‌” క్షయతో పీడితులవుతున్నా సరైన వైద్యం అందక ఆస్పత్రుల నుంచి వెంటనే ఇళ్లకు పంపించి వేయడం జరుగుతుంది. జనీవా కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డాక్టర్ ఎరిక్ ఎల్ క్రే కౌర్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోగులు ఇంటికి వెళ్లిన కొద్ది కాలంలోనే చనిపోవడం జరుగుతుంది.అంతేకాక వీరి వ్యాధి మరి కొందరికి సోకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ కారణంగా ఎక్స్‌డియర్ క్షయ పిడితులలో వైద్య చికిత్స పూర్తిగా చేయడం అవసరం. “ఎండి ఆర్ టిబి” ప్రపంచ మానవాళికి ముప్పు తెచ్చే వ్యాదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే జాతీయ స్థాయిలో క్షయ నిర్మూలన చేయాలిన ప్రణాళిక కొన్ని సవరణలతో చేయాల్సిన అవసరంపై భారతదేశం ఉదాసీనతగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. మందులకు ఏమాత్రం లొంగని మొండి క్షయ వ్యాధి చాలా వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. క్షయ రోగులకు కొత్త మందులు అందించడం, వారి పోషణ తగిన ఆర్థిక సాయం,వ్యాధి నియంత్రణకు అవసరమైన వైద్య చికిత్స ఇతర సామాగ్రి సమాకూర్చక పోతే ఈ వ్యాధి మిగతవారికి కూడా వేగంగా విస్తరిస్తుందని, ఉన్నత స్థాయి అధికారులు హెచ్చరిస్తునారు. ఈ విహయాలన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర క్షయ విభాగం అధికారులకు వివరించాయని వారు పెర్కోన్నారు. అమెరికా కు చెందిన పుడ్ ఆండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డిఎ) చెరర్విలిన్ ,డిలామనిక్ మందులను అంగీకరించింది. ఆ మందులు క్షయ రోగులందరికి అందుబాటులో ఉంచాలి. కానీ కేవలం చాలా తక్కువ మందికే ఈ మందులు లభిస్తున్నాయి. తెలంగాణలో ఏటా, 45,160 టిబి కొత్త కేసులు నమోదవుతున్నాయి. వాటిలో 1722 నయంకాని కేసులుచ చాలా కేసులు ఎండిఆర్ ,టిబి కిందకు వస్తాయి. ఈ తరహా క్షయరోగులను కుటింబీకులు దూరంగా ఉంచుతున్నారు.
ముఖ్యాంశాలుః
1.2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించాలని భారత దేశ లక్షం.
2. బ్యాక్టీరియాకు చెందిన 12 కుటుంబాలు క్షయ నివారణ మందులను ప్రతి ఘటిస్తున్నాయి.
3.60 శాతం టీబి కేసులు నమోదు కావడం లేదు. ప్రైవేట్ ఆస్సత్రులు ఈ రోగుల చికిత్సకు సంబంధించి ఎలాంటి రికార్డు నిర్వహించడం లేదు.