Home తాజా వార్తలు సంతోషపు చిరునామా!

సంతోషపు చిరునామా!

Happiness

 

సంతోషంగా ఉండండి అని పెద్దవాళ్లు దీవిస్తూ ఉంటారు. అలాగే ఒత్తిడిగా ఉంటే కాస్త ఆనందం కలిగించే పనుల్లో నిమగ్నం కండి అంటారు. మనసులో బాధ, దుఃఖం, కన్నీళ్లు గుర్తున్నట్లు సంతోష పడ్డ క్షణాలు ఎందుకు గుర్తుండవో… ఏమిటా చిత్రం! అసలు సంతోషం అంటే ఏమిటి? ఎక్కడ ఉంటుంది? వెతికితే దొరుకుతుందా? పరిశోధనకు అందుతుందా? అంటే పొరపాటే. అసలా పదార్థం మన దగ్గరే పదిలంగా ఉంది. ఎన్నో కారణాలతో సంతోషం బయటకి తీయకుండా నిర్లిప్తంగా ఉంటాం.. ఎందుకలా… సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ ఏదో ఒకటి మనకు అందలేదనే చింతతో ఉండటం వల్లే సంతోషం మన గుప్పిట్లో చిక్కకుండా పోతుంది. పోలిక తెచ్చుకుని, ఇతరులకున్న సౌకర్యాల్లో, సంతోషాల రూపమో, హోదానో ఏదో ఒకటి మనకు లేదనే బెంగతో ఉండటం వల్లనే ఆనందకరమైన జీవితం గడపలేరు అంటున్నారు పరిశోధకులు. ఎదుటివాళ్లను ఎప్పుడూ నమ్మకపోవటం, వాళ్లలో తప్పులు వెతకటమే పనిగా పెట్టుకోవటం వల్లే ముందు మన మనసులో ఆనందం కాస్తా ఆవిరైపోతుంది. ఈ ప్రపంచంలో మన జీవితంలో ఉన్న ప్రతిక్షణం ఆస్వాదించగలిగినది. ప్రతి క్షణాన్ని మన కోసమే అనుకోగలిగితే అసలు అనవసర విచారాలకు చోటే ఉండదు.

అసూయ అనర్ధహేతువు: అసూయ అ న్న మూడు అక్షరాల పదం మనిషిని కాల్చేసే కార్చిచ్చు వంటిది. ఇతరులకు ఉన్నదేదో మనకి లేదనే భావనే మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. ఇలాంటి ప్రతికూలమైన ఆలోచన మనసులో తలెత్తితే మనమే కాదు, మనతో ఉన్న వాళ్లూ ఇబ్బంది పడతారు. మన సంతోషం ఆవిరైపోతుంది. ఈ ప్రపంచంలో ప్రతి వాళ్లు ఎవరికి వాళ్లుగా ఒక ప్రత్యేకమైన వాళ్లు. అందరూ ఒకేలాగా, ఒకే మానసిక స్థితిలో ఆర్థికస్థోమతతో ఉండరు. పుట్టుకతోనే రం గు, కులం, హోదా, సంఘంలో స్థానం తెచ్చుకుంటారు. కొందరికి శరీరపు రంగు అద్భుతంగా ఉండచ్చు. కొందరికి మంచి కంఠం ఉండచ్చు. ఇంకొకళ్లు పుట్టుకతోనే ఐశ్వర్యవంతులుగా ఉండచ్చు. ఇవన్నీ మన ఆలోచనలోకి రానేకూడదు. మన గురించి మ నం ఆలోచించుకుని, ప్రతినిమిషం మనల్ని మనం ప్రేమించుకుని జీవితంలో ఇంతకంటే ఉన్నతమైన దశకు పోవాలని లక్షాన్ని నిర్ణయించుకోవాలి. మ నకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

వాస్తవంలో ఉండాలి: ఊహ కంటే వాస్తవం కాస్త చేదుగా ఉంటుంది. చాలామంది ఎప్పుడూ ఏదో ఒకటి భవిష్యత్తులో జరుగుతుందనే ఊహల్లో ఉంటారు. ఫస్ట్‌క్లాస్ రావాలి, సన్నగా అ యిపోవాలి, ఫిట్‌గా ఉండాలి, లాటరీ రావాలి, ఐశ్వర్యం వచ్చి ఒడిలో పడాలి… ఇవన్నీ ఊహల్లోనే కానీ గట్టిగా పట్టుదలగా ప్రయత్నం చేస్తే మనం కష్టపడి సాధించుకునేవే. బాగా చదివితే, చక్కగా ఒళ్లు కరిగేలా వ్యాయామం చేస్తే, చక్కని ప్లాన్‌తో ఏదైనా వ్యాపారం లోకి అడుగు పెడితే దేన్నయినా పొంద టం సాధ్యమే. అతిగా ఊహించుకోకూడదు. తీరా అంచనాలు నెరవేరకపోతే బాధే మిగులుతుంది. అందుకే చిన్న లక్షాలతో మొదలుపెట్టి వాటిని సాధిస్తూ అనుకున్న దిశగా నెమ్మదిగా సాగాలి. ఇష్టపడి చేసే పనిలో విజయం సాధించటం తేలిక. అం దులో పొందే ఆనందం అంతా ఇంతా కాదు.

ముంచేసే అబద్ధాలు: ఒక్క అబద్ధం ఆడితే దాన్ని కప్పి పుచ్చుకునేందుకు వంద అబద్ధా ల గోడ కట్టవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు నిజాయితీగా ప్రవర్తించటం చాలా ముఖ్యం. ఏ సం ఘటనా మన సొంత ఆనందాన్ని పాడు చేయకూడదు. మన ఆలోచనలను డిస్టర్బ్ చేయకూడదు. తో టివాళ్లకు సాధ్యమైనంత సాయం చేయటం, స్నేహితులతో నిజాయితీగా ఉండటం, కుటుంబసభ్యుల తో ఎప్పుడూ మాట ఇచ్చి తప్పకుండా ఉండటం చా లా అవసరం. ప్రతిదానికి అబద్ధాలు ఆడుతూ పోతే నష్టపోయేది మనమే. నాకేం ఒరుగుతుంది అన్న ఆలోచన పక్కన పెట్టి నేనేం చేయగలను అన్న ఉద్దేశ్యంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే ఇక మనసంతా సంతోషమే. మన చుట్టూ మనుష్యులుండటం కంటే సంతోషం ఇంకేముంటుంది.

ఆధారపడితే కూడా నష్టం: సాధ్యమైనంత వరకు మన పనులు మనం చేసుకుంటూ ఉం డాలి. ఇతరులపైన ఒక పని పెట్టామా అంటే వాళ్లపైన మనం ఎక్స్‌పెక్టేషన్ పెంచుకుంటున్నామని అ ర్థం. మన అంచనాలకు సరిపోయేలా ఎవరి పరిస్థితులలో వాళ్లు ఉంటారు. మనం ఒక పని కావాలని కోరుకుంటున్నప్పుడు, దాన్ని ఎదుటివాళ్లు ఏ దృష్టి లో దాన్ని చూశారు, ఎంత సమయం కేటాయించగలరు, ఆ పనిపట్ల వాళ్లకు శ్రద్ధ ఉందా? అసలు మనకు సహాయం వాళ్లు ఎందుకు చేయాలి? ఇవన్నీ మనసులో మెదిలితే ఎదుటివాళ్లపట్ల వ్యతిరేకభావన రాదు. వాళ్లు వాళ్లుగా మనం మనంగా ఉండటం క్షే మం. ఈ బరువు భారాలు ఎదుటివాళ్ల పైన పెట్టడం ఆపేస్తే సంతోషమే సంతోషం. మనిషి ఎప్పుడూ అవతలవాళ్ల దగ్గర నుంచి ఏదైనా ఆశించి నష్టపోతాడు. అలాంటి ఆశలు, అంచనాలు లేకపోతే అంతా సం తోషమే కదా. ప్రపంచంలో కొన్ని వందల దేశాలకు సంబంధించి కొన్ని వేల మందిని సర్వే చేశారు.

సంతోషంగా ఉండేందుకు మీరేం చేస్తున్నారు అని. దాదాపుగా ఏమీ చేయటం లేదనే సమాధానం వచ్చింది.సంతోషం కోసం నిజంగానే ప్రయత్నా లు చేయనక్కరలేదు. అది మన మనస్సులో దాగి ఉ న్న సంపద. ఆ నిధిని తవ్వి తీసేందుకు మనకు కా వలసింది ఎదుటి మనిషి నుంచి ఆశించని ఒక మా నసిక స్థిరత్వం. ఎదుటివాళ్లు మన ప్రతిబింబం వం టి వాళ్లు. మనం ఏం ఆలోచిస్తామో, ఆశిస్తామో, ప్రే మిస్తామో, యాచిస్తామో, కోరుకుంటామో, అదే ఎదుటివాళ్ల కూడా చేస్తారు. మనం ఇవ్వగలం అ న్న సమాధానం చెప్పగలిగితే మనకి కావాల్సింది దొరికినట్లే. మనం మనస్ఫూర్తిగా దేన్నయినా ఇస్తే అదే మనకు తిరిగి చేరుతుంది. సంతోషం కూడా అంతే. దాన్ని మనం ప్రపంచానికి ఇవ్వాలనుకుంటే చాలు. ఏం చేస్తే ఎదుటివాడు సంతోషంగా ఉం టాడో దాన్ని చేయగలిగితే ఆ సంతోషపు నిధికి మార్గం మనకు తెలిసిపోతుంది.

Articles about happiness