Home కరీంనగర్ కళలకు పుట్టినిల్లు తెలంగాణ!

కళలకు పుట్టినిల్లు తెలంగాణ!

రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర కీలకమైంది
గిన్నిస్‌బుక్‌ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న కళాకారులు
రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్
మనతెలంగాణ/హుజూరాబాద్‌టౌన్: తెలంగాణ రాష్ట్రం కళలకు పుట్టినిల్లని, కళరంగానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర కీలకమైందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రా

Artists who earned a place in the Guinness Book of Records
Artists who earned a place in the Guinness Book of Records

జేందర్ అన్నారు.ఆదివారం పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో కళా ర వళి సోషియో అసోసియేషన్ ఆద్వర్యంలో తెలంగాణ సా ంస్కృతిక సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు 1500 మంది కళాకారులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర స్థాయి డప్పు మహోత్సవాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అ తిథిగా హజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకరులు పాటలు,గేయాల ద్వారా ప్రజలను చైతన్యపరిచారన్నారు.కళాకారులకు ఆదుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఉద్యోగాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నిం పిందన్నారు.

కళాకారులు తమ కళల ద్వారా సమాజంలో నెలకొన్న రుగ్మతాలను దూరం చేయాలన్నారు.కాగా ము ఖ్యమంత్రి కెసిఆర్ 45 ఏళ్ల వయస్సు దాటిన కళాకారులకు నె లకు వెయ్యిరూపాయల ఫించన్ అందజేస్తామని ప్రకటించడంతో కళాకారులు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా సమాజంలో రోజురోజూకి మూఢనమ్మకాలు  పెరిగిపోతుండటంతో ప్రజలు ఆర్థిక ంగా నష్టపోతున్నారన్నారు. కళాకారులు తమ ఆట, పాట ద్వారా వా టిని దూరం చేయాలన్నారు. అనంతరం కళాకారులు 1200 సెకన్ల పా టు ఇచ్చిన ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారుల ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు అధికారులు నమోదు చేసుకున్నారు. అనంతరం కళాకారులకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. ఈ కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ క మిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, ఎంపీపీ వొడితెల సరోజనీదేవి, టీఆర్‌ఎస్ రాష్ట్ర సహయ కార్యదర్శి  శ్రీనివాస్, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత శ్రీనివాస్, కళారవళి సోషియో అసోసియేషన్ అద్యక్షులు విష్ణుదాస్‌గోపాల్‌రావు, సభ్యులు రమేష్‌గౌడ్,  హన్మంత్‌గౌడ్, గంగాధర్‌రెడ్డి, కన్నన్ దురై రాజు, క్యాస్ చక్రధర్ అందేసి నారాయణ తదితరులు ఉన్నారు.