Home తాజా వార్తలు సాగర్ బరిలో టిడిపి అభ్యర్థిగా మొవ్వ అరుణ్ కుమార్

సాగర్ బరిలో టిడిపి అభ్యర్థిగా మొవ్వ అరుణ్ కుమార్

Arun Kumar TDP candidate In Sagar Constituencyనల్గొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. సాగర్ ఎంఎల్ఎగా ఉన్న టిఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో అధికార టిఆర్ఎస్ ఇప్పటికే సాగర్ ఉప ఎన్నికపై దృష్టి సారించింది. కాంగ్రెస్, బిజెపిలు కూడా సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో టిడిపి కూడా సాగర్ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. సాగర్ నుంచి టిడిపి అభ్యర్థిగా మొవ్వ అరుణ్ కుమార్ ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణకు ఎంఎల్ సిగా అవకాశం కలిపించారు.   రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎంఎల్ సి నియోజకవర్గం నుంచి రమణ పోటీ చేస్తున్నారు.