Saturday, April 20, 2024

బాలీవుడ్‌లో ‘అరుంధతి’ రీమేక్..

- Advertisement -
- Advertisement -

Arundhati movie to remake in Hindi

హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్‌ని మలుపుతిప్పిన చిత్రం ‘అరుంధతి’. 2009లో ఎమోషనల్ అండ్ హారర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు అనేక రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ సినిమాతో అనుష్క ఒక్కసారిగా స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయింది. విలన్ పాత్ర చేసిన సోనూ సూద్‌కి తెలుగులో మంచి కెరీర్ ని ఇచ్చింది ఈ మూవీ. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో నటనకుగాను అనుష్క ఉత్తమ నటి, సూను సూద్ ఉత్తమ సహాయ నటుడి కేటగిరీలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు.

ఇక, అనేక విభాగాలలో ఈ మూవీ నంది అవార్డులను అందుకోవడం జరిగింది. కాగా ఈ క్రేజీ మూవీని ఎప్పటి నుండో హిందీలో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎట్టకేలకు అది సాకారమైంది. ‘అరుంధతి’ విడుదలైన 11 ఏళ్లకు ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను మెగా నిర్మాత అల్లు అరవింద్ దక్కించుకున్నారు. ఓ ఫ్యాన్సీ ధరకు ‘అరుంధతి’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న అల్లు అరవింద్ మరో నిర్మాత మధు మంతెనతో కలిసి నిర్మించనున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే& ‘అరుంధతి’ హిందీ రీమేక్‌లో అనుష్క పాత్ర కొరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ని తీసుకోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. మరి ఆమె కనుక ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే ఈ సినిమాకు మరింత హైప్ రావడం ఖాయం.

Arundhati movie to remake in Hindi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News