Home తాజా వార్తలు గల్ల పెట్టె డబ్బులు హరీశ్ రావు అన్నకే…

గల్ల పెట్టె డబ్బులు హరీశ్ రావు అన్నకే…

Arya Vaishya Womens money given to Minister Harish Rao

సిద్దిపేట: సిద్దిపేట అంటే ఏదో ఒక ట్రెండ్ క్రియేట్ చేయడంలో ముందుంటుంది. అదే విధంగా సిద్దిపేట ఆర్యవైశ్యులు కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. ఇంట్లో మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి  గల్ల పెట్టెలో డబ్బులు దాచుకుంటారు. ఎదైనా మొక్కు తీర్చుకోవటానికి హుండీలో వేసేందుకు దాచుకుంటారు. కానీ  సిద్దిపేట ఆర్యవైశ్య మహిళలంతా తమ గల్ల పెట్టె డబ్బులను మంత్రి హరీశ్ రావుకు ఇచ్చి అభిమానంను తెలియజేశారు. నిజానికి ఆర్యవైశ్య మహిళలు వారం వారం కిట్టీ పార్టీలు పెట్టుకుంటూ సామాజిక సేవలో భాగస్వామ్యం కావడానికి తమ వంతుగా ఎంతో కొంత గల్ల పెట్టెలో జమ చేసుకుంటారు. ఇవాళ  కిట్టీ పార్టీ డబ్బులను మంత్రి హరీశ్‌రావుకు  అందజేశారు.