Home జాతీయ వార్తలు ఆర్యన్ బృందానికి బెయిల్ తిరస్కరణ

ఆర్యన్ బృందానికి బెయిల్ తిరస్కరణ

Aryan Khan bail plea rejected in bombay high court

 

తిరిగి జైలుకు… బొంబాయి హైకోర్టులో అప్పీల్

ముంబై : సముద్ర నౌకలో డ్రగ్స్‌పార్టీలో అరెస్టు అయిన ఆర్యన్ ఖాన్‌కు స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మరో ఏడుగురికి మరోమారు బెయిల్ నిరాకరించారు. ప్రముఖ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు అయిన ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 3న డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు. తమకు బెయిల్ మంజూరు చేయాలని ఆర్యన్ ఇతరులు ముంబైలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ దరఖాస్తును న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసులో ఆర్యన్ మొదటి ముద్దాయిగా ఉన్నారు. ఇప్పుడు ఈ నెల 8 నుంచి స్థానిక అర్థూర్ రోడ్ జైలులో ఉన్నారు. ఇప్పుడు ఆయన బెయిల్ దరఖాస్తు తిరస్కరణకు గురికావడంతో తిరిగి ఆయన జైలుకు వెళ్లడం అనివార్యం అయింది. బెయిల్ దిగువ కోర్టులో రాకపోవడంతో ఆర్యన్ లాయర్ల బృందం ఇక బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్నారు.

ఈ నెల 2న మాదకద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్‌సిబి) బృందం గోవాకు బయలుదేరిన క్రూయిజ్ షిప్‌లో ఓ రేవ్‌పార్టీపై దాడి జరిపింది. మత్తు మందుల సేవనాల ఆరోపణలపై ఇప్పటివరకూ అరెస్టు అయిన వారి సంఖ్య 20కి చేరుకుంది. ఆర్యన్‌కు బెయిల్ కోసం ఆయన లాయర్లు సతీష్ మానేషిండే, అమిత్ దేశాయ్‌లు గట్టిగా వాదించారు. తమ క్లయింట్ వద్ద డ్రగ్స్ దొరకలేదని తెలిపారు. అయితే ఈ వాదనను ఎన్‌సిబి ఖండించింది. ఆర్యన్‌పై బలీయమైన అభియోగాలు ఉన్నాయని. ఆయన డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా ఏకంగా అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో కనెక్షన్లు పెట్టుకున్నాడని. చాలా ఏళ్లుగా డ్రగ్స్ రవాణాలకు దిగుతున్నాడని వాదనలు విన్పించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆయనకు తోటి బృందానికి బెయిల్ కుదరదని తేల్చిచెప్పింది. ఇప్పుడు స్థానిక న్యాయస్థానం నుంచి బెయిల్ అర్జీ ఇక హైకోర్టుకు చేరుకుంటోంది.

Aryan Khan bail plea rejected in bombay high court