- Advertisement -
జగిత్యాల: తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం రివర్స్ పంపింగ్ వంటి సాగునీటి పథకాలతో రానున్న రోజుల్లో కరువులేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జగిత్యాల్ జిల్లాలో ప్రసిద్ది పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామిని మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం దర్శించుకున్నారు. కొండటట్టు గుట్టపై రూ. 2.5కోట్లతో నిర్మించనున్న విరమణ మండపం, విరమణ మల్యాల మండల కేంద్రంలో రూ.1.30కోట్లతో పిహెచ్‌సి నూతన భవన నిర్మాణానికి మంత్రి ఈటల శంఖుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పలు సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం కరువు లేని రాష్ట్రంగా మరబోతుందన్నారు.
- Advertisement -