Friday, April 19, 2024

అమిత్ షా జీ.. విదేశీ వస్తువులను ఎలా బహిష్కరించాలో చెబుతారా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. దేశ ప్రజలు విదేశీ వస్తువులను కొనకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఓవైసీ తప్పుబట్టారు. ‘అమిత్ షా జీ.. విదేశీ వస్తువులను ఎలా బహిష్కరించాలో కాస్త వివరంగా చెబుతారా?” అని ఆయన అమిత్ షాకు ట్వీట్ చేశారు. వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతిస్తున్న మీరే ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారని ఓవైసీ మండిపడ్డారు. 88 శాతం మొబైల్ ఫోన్ల తయారీలో వాడే పరికరాలు, 70 శాతం ఔషధ తయారీకి కావాల్సిన ముడి సరకు, మరో 60 శాతం వైద్య పరికరాల్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఆయన గుర్తు చేశారు.

ఇలాంటి సమయంలో విదేశీ వస్తువులను ఎలా నిషేధించాలని అమిత్ షాను ఓవైసీ ప్రశ్నించారు. మరోవైపు, రెండు రోజుల క్రితం తబ్లీగీ జమాత్ సభ్యులపై కూడా ఓవైసీ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. సుమారు 38 మంది తబ్లీగీ జమాత్ సభ్యులు ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, వీరిలో 25 మంది తెలంగాణ వాసులు ఉన్నారని ఓవైసీ తెలిపారు. అయితే కొంతమంది తబ్లిగీ జమాత్‌ను కరోనా సూపర్ స్ప్రెడర్లుగా, కరోనా జీహాదీలుగా ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు.

Asaduddin Owaisi denied foreign goods Expulsion

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News