Home తాజా వార్తలు కెటిఆర్ తో క్యారమ్స్ ఆడిన అసదుద్దీన్!

కెటిఆర్ తో క్యారమ్స్ ఆడిన అసదుద్దీన్!

KTRహైదరాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాసేపు సరదాగా క్యారమ్ బోర్డ్ ఆడారు. సేదదీరేందుకు సరదాగా క్యారమ్ బోర్డ్ ముందు కూర్చున్నారు. ఈ ఫోటోలను కెటిఆర్ ట్విట్టర్ ఖాతాలో అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు.

అసదుద్దీన్ ఒవైసీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో, తాను కలిసిన ఫోటోను కెటిఆర్ షేర్ చేశారు. అసద్ తనకు మంచి మిత్రుడని తెలిపిన కెటిఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పాటు గడపాలని కోరుకుంటున్నానని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు.

 

Asaduddin Owaisi Played Carrom Board With KTR