Home జాతీయ వార్తలు ఎఎస్ఐని హత్య చేసిన మావోయిస్టులు

ఎఎస్ఐని హత్య చేసిన మావోయిస్టులు

Maoistsఛత్తీస్ గఢ్ : దంతెవాడ జిల్లా మలంగీర్ పరిధిలోని అరున్పూర్ లో ఇద్దరు పోలీసు సిబ్బందిని మావోయిస్టులు మంగళవారం ఉదయం కిడ్నాప్ చేశారు. ఎస్ఐ లీలావత్ కౌర్, ఎఎస్ఐ లలిత్ కశ్యప్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.  అనంతరం ఎఎస్ఐ లలిత్ కశ్యప్ ను మావోయిస్టులు హత్య చేశారు. ఎఎస్ఐ లలిత్ కశ్యప్ మృతిని ఎఎస్ పి పల్లవ్ ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కదలికలతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

ASI Murder by Maoists at Chhattisgarh